Hindus: శనివారం చికెన్, మటన్‌ ముట్టుకోరు.. ఎందుకో తెలుసా!

Hindus: ఆదివారం వచ్చిందంటే సాధారణంగా ప్రతి ఇంట్లో చికెన్‌ మటన్‌ వండుతుంటారు. పండుగలు వచ్చాయంటే మరి ఎక్కువగా మాంసాహారం చేస్తుంటారు. కొందరు హిందువులు కొన్ని ప్రత్యేక రోజుల్లో చికెన్, మటన్‌ జోలికి పోరు. చాలా మందికి వాటి వెనుక ఉన్న ఉద్దేశం తెలియదు. కానీ.. పెద్దలు చెప్పిన వాటిని ఆచరిస్తూనే ఉంటారు. కొందరేమో వాటిని మూఢ నమ్మకాలుగా భావిస్తుంటారు. వాటిని ఆచరించి కూడదంటూ ఇతరులను వాదిస్తూ ఉంటారు. అయితే.. ఆ ఆచారాలను మతపరంగా కాకుండా..వాటి వెనుక ఉన్న అసలు విషయాన్ని తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఆచారానికి శాస్త్రీయ కారణం ఉంటుందట.

సాధారణంగా సోమ, మంగళ, గురు, శనివారాల్లో మాంసం తినే హిందువులు చాలా మంది మటన్, చికెన్, చేపల గుడ్లను ముట్టుకోరు. అలాగే ఏకాదశి, పండగ విందులు, సముదాయాలు, కారణజన్ములు, పౌర్ణమి వంటి ప్రత్యేక రోజుల్లోనూ మాంసం తినరు. ఒక జంతువును చంపడం, ఏదైనా ప్రాణాన్ని తీసుకోవడం పాపమని హిందు మతం చెబుతుంది. అంతేకాక పలనా రోజు.. ఈ వారం తినకూడదు అని చెప్పడంతో జంతు వధ కాస్త్తయినా తగ్గుతుందని వారి నమ్మకం. అందుకే కొన్ని ప్రత్యేక రోజుల్లో తినకూడదంటారు. అయితే అతిగా మాంసాహారం తింటే కూడా శరీరంలో కొలెస్ట్రాల్‌ నిల్వ ఉంటడి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొవ్వు పెరిగే కొద్దీ గుండె సమస్యలు, పెద్ద ప్రేగు కేన్సర్, రక్తపోటు, కిడ్నీలో రాళ్లు, మూలవ్యాధులు తదితర సమస్యలు వేధిస్తుంటాయి.

అలాగే శరీర పోషణకు కొద్దిపాటి మాంసం మాత్రమే సరిపోతుంది. అతిగా తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం మన మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి, నోటి మాటతో తినవద్దు అంటే ఎవరూ పట్టించుకోరు. అందుకే, సోమ, మంగళ, గురు, శనివారాల్లో కొన్ని దేవుళ్లకు సంబంధించిన మతపరమైన విధి ని పెట్టారు. దేవుడి పేరు చెబితే అయినా తినకుండా ఉంటారని అలా చెబుతున్నారు.

సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుబు, గురువారం దత్తాత్రేయ, సాయిబాబా శనివారం ఆంజనేయుడు, వెంకటరమణ స్వామి ఇలా కొన్ని రోజులు కొన్ని దేవుళ్ల పేర్లతో తినకూడదంటారు. వారానికి ఒకసారి మాసం తింటే ఆరోగ్యానికి మంచిదని ఓ సర్వేలో తేలింది. మాసం తినే వారు కంటే తినని వారే ఆరోగ్యంగా ఎక్కువ రోజులు జీవిస్తారని వైద్యులు సైతం సూచిస్తుంటారు.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -