Meat: ఆరోజుల్లో హిందువులు మాంసం తినకూడదా.. ఏం జరిగిందంటే?

Meat: భారతదేశంలో హిందువులు వారంలో వారికి ఇష్టమైన దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉండడం వల్ల ఆరోజు మాంసాహారాన్ని తినరు. ఈ క్రమంలోనే కొందరు సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం తినడం మానేస్తే మరి కొందరు మంగళవారం కూడా తినడం మానేస్తూ ఉంటారు. కొంతమంది గుడికి వెళ్లి వచ్చిన తర్వాత తింటే మరికొందరు మంది మాత్రం ఆ రోజు మొత్తం తినకుండా ఉంటారు. అయితే ఆ రోజుల్లో మాంసాహారం ఎందుకు తినకూడదు అన్న విషయం చాలా మందికి తెలియదు.

ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడుని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం మంది వారంలో సోమ‌, మంగ‌ళ‌, గురు, శ‌ని వారాల్లో మాత్రం నాన్ వెజ్ తిన‌రు. అందుకు గల కారణం ఒక‌ప్పుడు బ్రాహ్మ‌ణులంతా క‌ల‌సి ఒక నిర్ణ‌యం తీసుకున్నారు. అదేమిటంటే జ‌నాలు ఎక్కువ‌గా మాంసాహారానికి అల‌వాటు ప‌డిపోయార‌ని, అది హానిక‌ర‌మ‌ని భావిస్తూ అంద‌రూ క‌చ్చితంగా శాకాహారం మాత్ర‌మే తినాల‌ని తీర్మానించారు. కానీ దీనికి చాలా మంది ఒప్పుకోలేద‌ట.

 

అయితే క‌నీసం సోమ‌, మంగ‌ళ‌, గురు, శ‌ని వారాల్లో అయినా మాంసాహారం మానేయ‌మ‌ని, అలా చేస్తే ఆ రోజుల్లో పూజించే దైవాల అనుగ్ర‌హం ల‌భిస్తుంద‌ని చెప్పారు. దీంతో ఆ రోజుల్లో నాన్‌వెజ్ తిన‌డం మానేశారు జ‌నాలు. మాంసాహారం తామ‌స ఆహారం. అంటే ఒంట్లో కామాన్ని, కోరిక‌ల‌ను పెంచుతుంది. దీంతో మ‌నుషులు వాటి బారిన ప‌డి ఉచ్చ నీచాల‌ను మ‌రిచిపోతారు. చేయ‌కూడ‌ని ప‌నులు చేస్తారు. వ్య‌క్తిగ‌త నియంత్ర‌ణ ఉండ‌దు. దీంతో ఇలా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు, సెల్ఫ్ కంట్రోల్ కోసం జ‌నాలు ఆయా రోజుల్లో నాన్ వెజ్ తిన‌డం మానేశారు. నాన్ వెజ్ తిన‌రు కాబ‌ట్టి దైవాన్ని పూజిస్తే అనుగ్ర‌హం క‌లుగుతుంద‌ని న‌మ్మారు. క‌నుక‌నే ఆ రోజుల్లో చాలా మంది నాన్ వెజ్‌ను తిన‌డం మానేశారు. చాలామందికి ఈ నిర్దిష్టమైన విషయాలు తెలియక ఆ రోజున మాంసాహారం తినకుండా ఉండడం వల్ల ఆయా దేవత అలా అనుగ్రహాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -