Telugu Movies: తెలుగు సినిమాల పరువు తీయడానికి కావాలనే ఇలా చేస్తున్నారా?

Telugu Movies: మామూలుగా ఒక సినిమా విడుదల అయింది అంటే ఆ సినిమా గురించి నెగిటివ్గా కామెంట్స్ చేసే వారు చాలామంది ఉంటారు అని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఇతర హీరోల అభిమానులు వేరే హీరోల సినిమాలపై కావాలనే నెగిటివ్ గా ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఈ సినిమా బాగానే ఉంది బ్లాక్ బస్టర్ హిట్ అని కొంతమంది చెప్పుకొస్తుండగా సినిమా అట్టర్ ఫ్లాప్ ఇది రామాయణం కాదు అని చెబుతున్న వారు కూడా ఉన్నారు. ఆదిపురుష్ సినిమా విషయంలో ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఆదిపురుష్ ను కావాలనే ఉద్దేశపూర్వకంగా ఫోటోలను వీడియోలను పెట్టి మరీ సినిమాలో చూపించిందంతా తప్పనే రీతిలో ప్రచారం చేస్తున్నారు. ఆదిపురుష్ ఇప్పటిదాకా వచ్చిన రామాయణ కథల్లో ఉత్తమ చిత్రమని ఎవరూ చెప్పరు. కాస్త టెక్నాలజీ వాడకం ఎక్కువైపోయి సాంప్రదాయ ప్రేక్షకులకు దర్శకుడు ఓం రౌత్ టేకింగ్ పట్ల మిశ్రమ స్పందన కలిగిన మాట వాస్తవం. అయితే అందరికీ కాదు. ఒకవేళ అదే నిజమైతే మొదటి రోజు 140 కోట్ల వసూళ్లు కళ్లజూసేది కాదు. రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ లో మంచి ట్రెండ్ చూపించేది కాదు. మరి పనిగట్టుకుని ఆదిపురుష్ మీద నెగటివ్ ట్వీట్లు పోస్టులు వేయిస్తున్నది ఎవరు. ఇప్పటికి ఇలాంటివి లక్షల్లో కనిపిస్తూనే ఉన్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఒక టీమ్ తయారైపోయి మీమ్స్ తయారు చేయించి వాట్సప్, టెలిగ్రామ్ తదితర గ్రూపుల్లో వాటిని వైరల్ చేయమని మెసేజులు పెడుతున్నారు.

 

అక్కడితో ఆగకుండా ఇన్ఫ్లూయన్సర్స్ కి డబ్బులు ఆఫర్ చేసి మరీ ట్రోల్ చేయమని ప్రోత్సహిస్తున్నారు. ఊరికే వచ్చే సొమ్మే కాబట్టి ఫేక్ ఐడిలతో నడిపే ట్విట్టర్ బ్యాచులు వెంటనే రంగంలోకి దిగిపోయి ఆదిపురుష్ వల్ల మొత్తం హిందూ ధర్మానికే నష్టం వచ్చిందనేలా ప్రచారం మొదలుపెడుతున్నారు. వందలాది నెటిజెన్లు ఆ ఫేక్ ట్వీట్స్ మాయలో పడి ఆదిపురుష్ మీద విషం చిమ్మే బాధ్యతను తీసుకున్నారు. ఇదంతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పని అంటే కొట్టిపారేయలేం. మరోవైపు ప్రభాస్ స్టార్ డం చూసి ఓర్వలేని కొన్ని బాలీవుడ్ వర్గాలు పనిగట్టుకుని ఇలా దిగజారి నెగటివ్ గా ప్రచారం చేస్తున్నాయన్న వెర్షన్ కూడా తీసిపారేసేది కాదు. ఆదిపురుష్ చివరి ఫలితం ఏమవుతుందన్నది సమస్య కాదు. ప్రీమియర్ జరిగిన కేవలం గంటల వ్యవధిలోనే ఇలా టాలీవుడ్ సినిమాను బజారుకీడ్చాలన్న పని మాత్రం నిజంగా ఖండించదగినదే. అయినా విమానంలో ఉన్న టాలీవుడ్ స్థాయిని కింద బస్సు కిటికీలో నుంచి చూసి వెక్కిరించి ఏదో సాధించామని ఫీలవుతున్న అమాయకత్వానికి నవ్వుకోవడం తప్పు చేసేది ఏమీ లేదు.

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -