Puja: ఈ పూజలు చేస్తే అంతా మంచే జరుగుతుందా.. అలాంటి ఫలితాలు వస్తాయా?

Puja: ఒకానొక సమయంలో మన పెద్దలు ఎన్నో ఆచార వ్యవహారాలను పాటించేవారు అయితే ప్రస్తుత కాలంలో ఈ ఆచార వ్యవహారాలను సాంప్రదాయాలను పాటించే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది ఆచరించే సాంప్రదాయాలు మనకు తెలియక పోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు అలాగే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ పెద్దవారితో కలిసి ఉండడానికి ఇష్టపడటం లేదు కొన్ని కారణాలవల్ల వేరుగా ఉండటం ఉద్యోగరీత్యా తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల ఇలాంటి సాంప్రదాయాల గురించి చెప్పేవారు కూడా లేకపోవడంతో మనం కొన్ని సాంప్రదాయాలను పూర్తిగా గాలికి వదిలేస్తున్నాం.

మరి సనాతన ధర్మం ప్రకారం మన రోజువారీ జీవితంలో కొన్ని సాంప్రదాయాలను పాటించడం ఎంతో ముఖ్యం మరి ఆ సాంప్రదాయాలు ఏంటి అనే విషయానికి వస్తే.. మంగళవారం పుట్టింటి నుంచి అత్తవారింటికి ఆడబిడ్డ అసలు వెళ్ళకూడదు. అలాగే అత్తవారి ఇంటి నుంచి శుక్రవారం పుట్టింటికి వెళ్ళకూడదు. ఇంట్లో పనులు చేస్తున్న సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి సంధ్యా సమయం అయితే ఎవరికి ఉప్పు పెరుగు అప్పుగా ఇవ్వకూడదు అలాగే సంధ్యా సమయం అయిన తర్వాత ఇల్లు ఊడ్చడం తల దువ్వుకోవడం స్నానం చేయడం బట్టలు ఉతకడం మహా పాపం

 

ఇంట్లో గోర్లు కత్తిరించకూడదు అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు,ఎవరైనా పనిమీదనా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు అంటే మనం జుట్టు విరపోసుకొని ఉండకూడదు అలాగే ఇల్లు ఊడ్చకూడదు. ఇంటి నుంచి పనుల నిమిత్తం బయటకు వెళ్లే వాళ్ళు సరాసరి బయటకు వెళ్లిపోవాలి కానీ ఇంట్లో కాసేపు కూర్చొని ఆగి వెళ్ళకూడదు. సంధ్య సమయంలో ముత్తైదువులు ఇంటికి వస్తే తప్పకుండా వారికి పసుపు కుంకుమ ఇచ్చి పంపించాలి. తిన్న వెంటనే నిద్రపోకూడదు.

 

ఇక ఇంట్లో పనికిరాని గడియారాలు తొక్కని సైకిల్స్ పగిలిపోయిన గాజు పెంకులు అద్దం వంటివి ఉంటే కనుక వెంటనే వాటిని బయటకు పడేయాలి. ఇకపోతే శనివారం రోజు పొరపాటున ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయకూడదు అలాగే నువ్వులు నూనె వంటి వస్తువులను శనివారం కొనుగోలు చేయకూడదు. ఇక సోమవారం పొరపాటున కూడా తలకు నూనె రాసుకోకూడదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -