TDP: ఎన్టీఆర్ విషయంలో టీడీపీ సైలెంట్.. అమిత్ షాతో భేటీపై మౌనం ఎందుకంటే?

TDP: అమిత్ షా-ఎన్టీఆర్ భేటీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా చర్చకు దారి తీసింది. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారనేది బయటకు వెల్లడించలేదు. కానీ రకరకాల ఊహాగానాలు రాజకీయ వర్గాలు, మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఆర్ఎస్ఎస్ పై తీయబోతున్న సినిమాతో పాటు కాశ్మీర్ ఫైల్స్ తరహాలో తెలంగాణలోని రజాకార్ల అరాచకాలపై బీజేపీ తీయబోతున్న రజకార్ ఫైల్స్ సినిమాలో నటించాల్సిందిగా ఎన్టీఆర్ ను అమిత్ షా కోరినట్లు కొంతమంది చెబుతున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు బీజేపీ ఒడ్డుతోంది. అందులో భాగంగా తెలంగాణలోని సెటిలర్ల, కమ్మ సామాజికవర్గ ఓటర్లను ఆకర్షించేందుకు అమిత్ షా భేటీ అయినట్లు మరికొందరు చెబుతున్నారు. అలాగే సౌత్ ఇండియా వ్యాప్తంగా ఎన్టీఆర్ క్రేజ్ ను ఉపయోగించాలని బీజేపీ ప్లాన్ చేసినట్లు మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఇలా ఎవరికి తోచినట్లు వారు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇరువురి భేటీ వెనుక అసలు సీక్రెట్ ఏంటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది.

ఈ క్రమంలో అమిత్, ఎన్టీఆర్ పై భేటీపై ఏపీ ప్రతిపక్ష టీడీపీ స్పందించకపోవడం గమనార్హం. టీడీపీ నేతలెవ్వరూ కూడా అమిత్ షాతో ఎన్టీఆర్ సమావేశంపై నోర మెదకపలేదు. గతంలో 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత టీడీపీకి దూరమైనా తాత స్థాపించిన పార్టీగా జూనియర్ ఎన్టీఆర్ కు చాలా ఇష్టముంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాల పరంగా ఎన్టీఆర్ పీక్స్ స్టేజ్ లో ఉన్నారు. ఇలాంటి సమయంలో సినిమాలను వదిలేసుకుని రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఎన్టీఆర్ లేరు.

అయితే ఎన్టీఆర్ తో అమిత్ షా ఎందుకు భేటీ అయ్యారనేది ఆసక్తి కలిగిస్తోంది. బీజేపీలో చేరాలని ఆహ్వానించారా.. లేక బీజేపీ తరపున ప్రచారం నిర్వహించాలని కోరారా.. లేక మద్దతుదారుడిగా ఉండమని కోరారా అనేది చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంత చర్చ జరుగుతున్నా.. టీడీపీ వర్గాలు ఎందుకు స్పందించడం లేదనేది చర్చకు దారి తీస్తుంది. ఎన్టీఆర్ ను టీడీపీలోకి తీసుకోవాలని చంద్రబాబును తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు సభలు, పర్యటనల సమయంలో బహిరంగంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

ప్రస్తుతం ఏపీలో టీడీపీ క్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఎన్టీఆర్ టీడీపీలోకి తీసుకురావాలని, ప్రచారం చేయించాలని చంద్రబాబున పార్టీ నేతలు కోరుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం అలాంటి ప్రయత్నాలేమీ చేయడం లేదు. ఇప్పుడు అమిత్ షాతో భేటీపై కూడా టీడీపీ నేతలు మెతక వైఖరి అవలంభిస్తున్నారు. స్పందించడానిక కూడా అసలు ఇష్టపడటం లేదు. స్పందించవద్దని పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయని కొంతమంది అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -