PV Sidda Reddy: సీఎం జగన్ టూర్ కు దూరంగా సిద్ధారెడ్డి.. హర్ట్ కావడం వల్లే ఆయన అలా చేశారా?

PV Sidda Reddy: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగలం పేరిట యాత్ర నిర్వహిస్తూ ఉండగా మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేపట్టారు. ఈ బస్సు యాత్ర ఇడుపులపాయలో మొదలయ్యి ఇచ్చాపురం వరకు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో పాల్గొన్నారు.

ఈ బస్సు యాత్రలో భాగంగా పెద్ద ఎత్తున ప్రజలు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు పలికారు. కానీ అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి మాత్రం ఈ పర్యటనకు దూరంగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం కదిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈయన సీఎం పర్యటనకు రాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది అయితే ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పట్ల బాగా హర్ట్ అయ్యారని అందుకే సీఎం పర్యటనకు కూడా దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

కదిరి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నటువంటి సిద్ధారెడ్డి వచ్చే ఎన్నికలలో కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని తనకు టికెట్ వస్తుందని ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సిద్ధారెడ్డికి కాకుండా కదిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మగ్బూల్ అహ్మద్ పేరును ప్రకటించారు. దీంతో సిద్ధారెడ్డి బాగా హర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇలా ఈయన హర్ట్ కావడంతోనే సీఎం బస్సు యాత్రకు కూడా దూరంగా ఉన్నారని తెలుస్తోంది. మరి సిద్ధారెడ్డి మనసులో ఏముంది ఇప్పటికే టికెట్ ఆశించి రానటువంటి వారందరూ కూడా సైకిల్ చెంతకు చేరారు. మరి ఈయన మనసులో ఏముందనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -