AP CM Jagan: ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోని ఏపీ సీఎం జగన్.. సారా బాధితులను ఆదుకునే దయాగుణం లేదా?

AP CM Jagan: తనకు మించిన మానవతావాది లేరన్నట్టు ఏపీ సీఎం జగన్ చెబుతూ ఉంటారు. కానీ, ఒకే ఊరిలో కల్తీసారా తాగి 27 మంది మృతి చెందితే పట్టించుకున్న పాపన పోలేదు. రెండేళ్లు క్రితం ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో కల్తీసారా తాగి 27 మంది మృతి చెందారు. ఈ వార్త జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. 2022 మార్చి 8 నుంచి 11 మధ్యలో ఆ గ్రామంలో ప్రతీ రోజు అనారోగ్యంతో మృతి చెందేవారు. దీంతో.. మృతుల కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. ఈ దుర్ఘటన జరిగి రెండేళ్లు అవుతున్నా.. జగన్ మాత్రం వారిని పరామర్శించలేదు. ఆ ఘటనలో గ్రామంలో తండ్రి లేని చిన్నారులు, భర్త లేని భార్యలు.. కొడుకు లేని దంపతులు ఇలా చాలా మంది అనాధులు అయ్యారు. ప్రభుత్వ సాయం కోసం రెండేళ్లుగా వారంతా ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం అవి సహజ మరణాలని కొట్టిపారేస్తుంది. జంగారెడ్డిగూడెంలో చనిపోయిన వారంతా మామూలుగానే చినిపోయారని జగన్ అసంబ్లీ సాక్షిగా ప్రకటించారు. చనిపోయిన వారు వాంతులు, కడుపులో మంట, కళ్లు మసకలు లాంటి లక్షణాలతో చనిపోయారు. ఇవి అన్నీ కల్తీ సారా లక్షణాలే అని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ప్రతిపక్షాలు వారిని ఆదుకోవాలని మొత్తుకుంటున్నారు. కనీసం వైసీపీ ప్రభుత్వం వారి పోస్టుమార్టం రిపోర్టుపై కూడా దృష్టి పెట్టలేదు. ఈ ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు వారిని పరామర్శించారు. మట్టి ఖర్చులకు ఒక్కో కుటుంబానికి పది వేలు, ఆర్థిక సాయం లక్ష రూపాయలు అందించారు. ఇక జనసేన, బీజేపీ నేతలు కూడా వెళ్లారు. అసలు కనుమరుగైన కాంగ్రెస్ నేతలు కూడా మానవతా దృక్పదంతో వెళ్లి వీలైంత ఆర్థిక సాయం చేశారు. కానీ, సీఎం జగన్ మాత్రం వెళ్లలేదు.

ప్రభుత్వ చెబుతున్నట్టు అవి కల్తీసార వలన చనిపోలేదనే అనుకుందాం. మరి నాలుగు రోజుల్లో 27 మంది ఒకే ఊరిలో ఎలా చనిపోతారనే దానిపై అయినా దృష్టి పెట్టాలి కదా? దానికి సమాధానం చెప్పాలి కదా? సహజమరణాలు అయితే.. నాలుగు రోజుల్లో అంత మంది చనిపోతారా? కాసేపు ఎలా చనిపోయారనే విషయాన్ని పక్కన పెడితే అసలు ఒక్క గ్రామంలో అంత విషాదకరమైన ఘటన జరిగినపుడు పరామర్శించాలి కాదా? ఎందుకు ఆ గ్రామానికి జగన్ వెళ్లలేదు? వైసీపీ నేతలు దీనికి సమాధానం చెప్పాలి. ప్రత్యేకంగా వారి కోసం ఆర్థికసాయం ఎలాగూ చేయలేదు. కనీసం భర్తను కోల్పోయిన మహిళలకు వితంతు ఫించను అయిన ఇవ్వాలి కదా? ప్రభుత్వ పథకాల కోసం బాధితుల్లో అలాంటి మహిళలకు ఎదురు చూపులే మిగిలాయి. బాధితుల్లో చాలా మందికి ఇళ్లు కూడా లేవు. వారికి కనీసం జగనన్న కాలనీల్లో పట్టాయి అయినా ఇప్పించాలని కదా? అది కూడా చేయడం లేదు. దీంతో జగన్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కార్యకర్తల పెళ్లిళ్లకు ప్రత్యేక విమానాల్లో వెళ్లే సీఎం జగన్ ఇరవై ఏడు మంది చనిపోతే పరామర్శించలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -