Late Night Sleeping: రాత్రులు లేటుగా పడుకుంటే అలాంటి వ్యాధులు రావడం ఖాయం?

Late Night Sleeping: ఇదివరకటి రోజుల్లో ఉదయాన్నే సూర్యోదయం కాకముందే నిద్రలేచి చక చకా పనులు పూర్తి చేసుకుని పనులకు వెళ్లిపోయేవారు. ఆ తర్వాత సూర్యాస్తమయం సమయంలో ఇంటికి వచ్చి ఆహారం తిని ఏడు ఎనిమిది గంటల లోపు అంతా నిద్రపోయేవారు. అయితే ఇది ఒకప్పుడు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది..ఉదయం 7, 8, 9,10 గంటలకు 11 గంటలకు కూడా నిద్ర లేచేవారు ఉన్నారు. ఇక రాత్రి సమయంలో అర్ధరాత్రి సమయంలో ఒంటిగంట రెండు గంటల వరకు కూడా మేలుకొంటూ మొబైల్ ఫోన్లతో ఫ్రెండ్స్ తో గడుపుతూ కాలక్షేపం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు.

అర్ధరాత్రి ఎప్పుడో పడుకోవడం తెల్లవారి బారెడు పొద్దెక్కిన లేవకపోవడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే రాత్రిళ్లు లేటుగా నిద్ర పోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి. మరి రాత్రిళ్ళు లేటుగా పడుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనకు తెలుసుకుందాం.. రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే వ్యాధులలో ముఖ్యమైనది గుండెకు సంబంధించిన వ్యాధులు. మన నిద్ర గుండెపై ఎఫెక్ట్ చూపుతుంది. రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్ర పోవడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. సమయానికి నిద్రపోవడం వల్ల ఇటువంటి ఇబ్బందులు కలగవు. శరీరానికి తగినంత నిద్ర లేకపోవడం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కష్టం.

 

ప్రతిరోజు ఆలస్యంగా నిద్రపోయేవారిలో సిర్కాడియన్‌ రిథమ్‌ తగ్గుతుంది దాన్ని నివారించాలంటే రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య నిద్రపోవాలి. లేట్‌గా నిద్రపోయే మహిళలు ఈ టైంను తప్పనిసరిగా పాటించాలి. ఆలస్యంగా పడుకునే వారు మార్నింగ్ ఆలస్యంగా నిద్ర లేస్తారు. అది వారి గుండెపై ప్రభావం చూపుతుంది. రాత్రి పూట త్వరగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు తలెత్తకుండా చూసుకోవచ్చు. రాత్రి ఆలస్యంగా నిద్రపోయే వారిలో హార్ట్ డిసీజ్ లు, గుండె పోటు, గుండె ఫెయిలవడం వంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. అధ్యయనం ప్రకారం ఆలస్యంగా పడుకునే వారిలో 25 శాతం ఎక్కువగా గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -