Samantha: అమెరికాకు వెళుతున్న సమంత.. ఎందుకో తెలుసా?

Samantha:టాలీవుడ్ ప్రేక్షకులకు సమంత పేరు పరిచయం అక్కర్లేనిది. టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించిన స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఇక సమంత అభిమానులు గురించి మనందరికీ తెలిసిందే. సమంత క్రేజ్ కు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా మరో స్థాయిలో ఫిదా అయ్యింది. సమంత బాలీవుడ్ లో కూడా పలు వెబ్ సిరీస్ లు చేస్తుంది.

ఇక దర్శకుడు సుకుమార్ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన పుష్ప సినిమా తో సమంత పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. అంతేకాకుండా సమంత వరల్డ్ వైడ్ గా సినిమా అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా మూడు పువ్వులు ఆరు కాయలు లా వెలుగుతుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన మూవీ అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అంతేకాకుండా తన హాట్ పోస్టు లను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటుంది. ఇదిలా ఉంటే సమంత గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. సమంత చర్మ సమస్యల వలన షూటింగ్ లో పాల్గొనడం లేదని, దాని కారణంగానే సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు అని కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి.

కాగా ఇటీవల సమంత మేనేజర్ ఇవన్నీ ఒట్టి పుకార్లని కొట్టి పారేసాడు. ఇక తాజాగా సమంత గురించి మరో వార్త తెగ చక్కర్లు కొడుతుంది. త్వరలో సమంత స్కిన్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. అమెరికాలో ఉన్న టాప్ స్కిన్ కేర్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకోబోతుందట. అందుకే ఖుషి సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనలేనని సమంత తెలిపిందట. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో ఒక జోరుగా సాగుతుంది. మరి ఈ వార్తలు గురించి సామ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -