Adipurush: దూసుడు పెంచిన మైత్రీ మూవీస్.. ఆ సినిమాల రిలీజ్ ఎప్పుడంటే?

Adipurush: ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో మేకర్స్ ఫిక్స్ చేశారు. సినిమా ప్రారంభం నాటి నుంచే ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి ముహుర్తానికి ఫిక్స్ చేశారు. అప్పుడు కరోనా వల్ల అన్ని సినిమాలకు డేట్లు మారుతూ వచ్చాయి. ఈ క్రమంలో అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా కూడా వాయిదా పడింది. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆగస్టు 11న విడుదల చేశారు. టీ సిరీస్, భూషన్, ఓం రావత్ ఇలా అందరూ కూడా ఆదిపురష్ సినిమాను వాయిదా వేసేందుకు ఎంతో గొప్ప మనసుతో అంగీకరించారంటూ లాల్ సింగ్ చడ్డా టీమ్ ప్రకటించారు. ఆదిపురుష్ సినిమా టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ‘ఆదిపురుష్’ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మేకర్స్ ప్రమోషన్స్ చేయడంలో బిజీ అయ్యారు. ఇటీవల విడుదలైన టీజర్ రెండు రకాలు రెస్పాన్స్ ను అందుకుంది. అయితే ఆదిపురుష్ సినిమా విడుదలైన రోజున 35 వేల కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందన్నారు. ఓపెనింగ్స్ విషయంలో భారీ కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం ఇండియాలో 9,500 స్క్రీన్లు ఉన్నాయి. అందులో ఆరున్నర వేల స్క్రీన్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. మిగిలినవి మల్టీప్లెక్సులు. వాటిలో సుమారు 8 వేల స్క్రీన్లలో ఆదిపురుష్ సినిమాలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తోంది. దీంతో మైత్రీ మూవీస్ దూకుడు పెంచారు. చిరంజీవి, బాలకృష్ణ హీరోల సినిమాలను నిర్మిస్తోంది.

ప్రస్తుతం ఆదిపురుష్ వీఎఫ్‌ఎ‌క్స్ వర్క్ లేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆదిపురుష్ సినిమా రిలీజ్ లేట్ అయింది. చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు సంక్రాంతి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. లేదా ఈ రెండు హీరోల సినిమాల్లో ఒక సినిమా సంక్రాంతికి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు విజయ్-దిల్ రాజు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారసుడు’ సినిమా మాత్రమే సంక్రాంతి రోజు రిలీజ్ చేస్తున్నట్లు కన్‌ఫర్మ్ చేశారు. అయితే మరోవైపు ఆదిపురుష్ సినిమాను వాయిదా పడే అవకాశం లేదంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -