Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ తో బాలయ్య మూవీ హిట్టవుతుందా?

Jr. NTR: నందమూరి హీరోల్లో అటు బాలయ్యకు ఇటు ఎన్టీఆర్ కు గ్యాప్ ఉందన్న సంగతి తెలిసిందే. చాలా రోజుల నుంచి వారికి సంబంధించి పలు ప్రచారాలు సాగుతున్నాయి. గత పది సంవత్సరాలలో ఈ స్టార్ల మధ్య అంత సఖ్యత లేదని కూడా ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ పలు సందర్భాల్లో కలుసుకున్నా మళ్లీ గ్యాప్ రావడం, ఆ తర్వాత మళ్లీ ఏదో కార్యక్రమంలో కలుసుకోవడం వంటివి జరుగుతోంది.

 

తాజాగా మ‌రోసారి బాల‌య్య‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలిసిపోయినట్లు కనిపిస్తోంది. ఈ స్టార్ల అభిమానుల మ‌ధ్య స‌ఖ్య‌త కుదిరినట్లుగా టాక్ వినిపిస్తోంది. 2023లో సంక్రాంతి కానుకగా బాల‌య్య వీర‌సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇదే టైంలో మెగస్టార్ చిరంజీవి కూడా వాల్తేరు వీర‌య్య సినిమా ద్వారా వస్తున్నాడు. ఈ రెండూ ఒక్క రోజు తేడాలో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ పడనుండగా చిరు, బాల‌య్య ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

 

చిరంజీవి సినిమాకు అటు మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉంది. అందుకే సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వీర‌సింహారెడ్డి సాంగ్స్‌, వీడియోల‌కు వ‌స్తోన్న వ్యూస్ కంటే వాల్తేరు వీర‌య్య సాంగ్స్‌, వీడియోల‌కు ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి. వాల్తేరు వీర‌య్య‌కు అటు చెర్రీ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ తో పాటు రవితేజ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోడవ్వడంతో చాలా ప్లస్ కానుంది.

 

అయితే బాలయ్య వీరసింహారెడ్డి సినిమాకు సపోర్టింగ్ గా బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే ఉండనున్నారు. అందుకే తారక్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. పండగ సినిమాల్లో తారక్ ఫ్యాన్స్ వీర‌సింహారెడ్డికి పూర్తిగా సపోర్ట్ ఇస్తామని చెబుతున్నారు. దీంతో నందమూరి అభిమానుల్లో సందడి మొదలైంది. వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానుంది. తమిళ హీరో విజ‌య్ తీసిన వార‌సుడు సినిమాను బాలయ్య సినిమా ఢీకొట్టనుంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -