Chiranjeevi-Janasena: జనసేనకు మెగాస్టార్ మద్దతు కన్ఫార్మ్? ముందే లీకులిచ్చారా?

Chiranjeevi-Janasena: ఏపీ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో జనసేన పాత్ర కీలకం కానుంది. ఇటీవల ఏపీలో జనసేన బలం క్రమక్రమంగా పంజుకుంటోంది. చాపకింద నీరులా జనసేన బలపడుతుంది. రాజకీయంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరింత దూకుడు పెంచారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కౌలు రైతులకు తమ సొంత డబ్బులతో ఆర్ధిక సహాయం చేశారు. నిరంతరం ఏదోక కార్యక్రమంతో పవన్ జనాల్లోనే ఉంటూ వస్తున్నారు.

ఈ క్రమంలో ఏపీలో గత ఎన్నికలతో పోలిస్తే జనసేన బలం మరింత పుంచుకుంది. జగన్ ను ఎలాగైనా ఓడించడమే తన లక్ష్యమని, ఎవరితోనైనా పొత్తు పెట్టకుంటానంటూ బహిరంగ ప్రకటన చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను అసలు చీలనివ్వనంటూ స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమనే ఊహాగానాలు ఏపీ పొలికల్ కారిడార్ లో హల్ చల్ చేస్తున్నాయి. బీజేపీ కలిసి వస్తుందా.. లేదా అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. బీజేపీ రాకపోయినా తాను మాత్రం టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున ేఅవకాశముందని చెబుతున్నారు.

అయితే జనసేన పార్టీ పెట్టి ఎనిమిదేళ్లు అయినా పవన్ కల్యాణ్ ఒక్కరే సింగిల్ గా పోరాడుతున్నారు. మోగా ఫ్యామిలీ నుంచి నాగబాబు పార్టీలో చేరి మద్దతు ఇవ్వగా.. మిగతా కుటుంబ సభ్యులు విరాళాల రూపంలో పవన్ కు సపోర్ట్ చేస్తున్నాయి. యితే పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఇప్పటివరకు జనసేనకు ఎక్కడా మద్దతిచ్చింది లేదు. కనీసం ఇన్ డైరెక్టుగా కూడా ఎక్కడా సపోర్ట్ చేయలేదు. ఒక ట్వీట్ ద్వారానో లేదా విరాళం రూపంలో మరో మార్గం ద్వారానే జనసేనకు మద్దతు ఇచ్చింది లేదు. దీంతో చిరు మద్దతు కోసం జనసేన వర్గాలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాయి. చిరు మద్దతు ఇస్తే జనసేనకు రాజకీయంగా ఉపయోగపడుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ వచ్చే ఎన్నికల్లో జనసేనకు చిరు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. బహిరంగంగా కాకపోయినా ట్వీట్ ద్వారా లేదా వేరే మార్గంలో పరోక్షంగా జనసేనకు సపోర్ట్ చేసే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.

తాజాగా పవన్ బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ చిరు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. తమ్ముడి మనసులో ఎప్పుడూ జనమే ఉంటారని, జనం కోసం పడతారని చిరు ట్వీట్ చేశారు. ఈ విషయంలో తమ్ముడు విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు దీవించారు. చిరు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ డైరెక్టుగా జనసేనకు సపోర్ట్ చేసేలా ఆ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో పవన్ కు చిరు మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

జగన్ పాలనపై చిరు అసంతృప్తిగా ఉన్నారు. సినిమా టికెట్ల తగ్గింపు అంశంపై ఏకంగా సీఎం జగన్ ను చిరు బ్రతిమిలాడుకున్నారు. పలుమార్లు జగన్ ను కలిసి టికెటో్ రేట్లు పెంచాలని కోరారు. అయితే జగన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక తన తమ్ముడు పవన్ పై వ్యక్తిగతంగా జగన్ చేసే విమర్శలు కూడా చిరుకు నచ్చడం లేదు. ఒకప్పుడు జగన్, చిరు మధ్య మంచి సత్సంబంధాలు ఉండేవి. కానీ సినిమా టికెట్ల అంశంలో ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టడంతో ఇప్పుడు జగన్, చిరు మధ్య బాగా గ్యాప్ వచ్చినట్లు అర్ధమవుతుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో జగన్ ను గద్దె దించేందుకు ప్రయత్నాలు చేస్తున్న పవన్ కు చిరు మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -