Gopichand: ప్రయోగాలు చేయకపోతే గోపీచంద్ కు ఇబ్బందులు తప్పవా?

Gopichand: టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్, డింపుల్ హయతి కలిసి నటించిన తాజా చిత్రం రామబాణం. తాజాగా మే 5వ తేదీన విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే భారీగా అంచనాల నెలకొన్నాయి. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ ఈ సినిమాకు ఆశించిన విధంగా స్పందన రావడం లేదు. విడుదల అయిన మొదటి రోజే దారుణమైన వసూళ్లను రాబట్టింది. కనీసం రెండు కోట్లు కూడా రాబట్టలేని దారుణమైన స్టేజికి గోపీచంద్ దిగజారిపోవడం అన్నది ఆశ్చర్యకరంగా మారింది.

సినిమా విడుదలకు ముందు ఫ్రీ రిలీజ్ ఈవెంట్, వరస ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్ లు నిర్వహించి ఈ సినిమాను చిత్ర బృందం ప్రేక్షకులలోకి బాగానే తీసుకెళ్లారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని చిత్ర బృందం కూడా అభిప్రాయపడ్డారు. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో చిత్ర బృందంతోపాటు గోపీచంద్ అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ప్రస్తుతం గోపీచంద్ అయోమయ పరిస్థితిలో పడ్డారు. అయితే గోపీచంద్ కి ఇది క్లిష్ట పరిస్థితి అని చెప్పవచ్చు.

 

ఎందుకంటే తరచూ రొటీన్ ఫార్ములానే తాను ఇమడలేకపోవడమో లేదా సరిగా వాడుకునే దర్శకులు దొరక్కపోవడమో కారణం. మొత్తానికి మార్కెట్ అయితే దెబ్బ తింటోంది. పక్కా కమర్షియల్ లాంటి కోర్టు డ్రామా చేసినా, సీట్ మార్ లాంటి స్పోర్ట్స్ మూవీ చేసినా అన్నిటిలో అవసరానికి మించి కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించడం వల్ల ఫలితాలు రిపీట్ అవుతున్నాయి. లౌక్యం నాటి కాలం కాదిది. మొత్తానికి గోపీచంద్ ప్రయోగం చేయకపోతే గోపీచంద్ కెరీర్ ముగిసినట్లే అని అంటున్నారు అభిమానులు. సమయం తీసుకుని మంచి దర్శకులతో ఒక ప్రయోగం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తే తప్ప ఈసారి సక్సెస్ కాలేదు అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇకమీదట అయినా గోపీచంద్ ఆచూతూచి వ్యవహరించి కథల ఎంపికల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాలి మరి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -