YS Vijayamma: కొడుకు వైపు వెళుతుందా… కూతురి పంచన చేరుతుందా….!

YS Vijayamma: తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ కుటుంబానిది ప్రత్యేక నేపథ్యం. తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కాస్తాయి గుర్తింపు పొందారు.వైయస్ మరణానంతరం జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎదిరించి ఓదార్పు యాత్ర చేయడం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపన జైలుకెళ్లడం ఇలా వరుస పెట్టి అన్ని విషయాలు తెలిసినవే.

 

అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో వైఎస్ జగన్ పాత్ర ఎంత ఉందో వైఎస్ షర్మిల వైయస్ విజయమ్మ పాత్ర కూడా అంతే ఉంది. ఇంకా చెప్పాలంటే జగన్ సతీమణి భారతి కంటే విజయమ్మ షర్మిల కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లిన సమయంలో పార్టీని ముందు నుంచి నడిపించింది విజయమ్మ, షర్మిల మాత్రమే. పాదయాత్రలు చేసిన బస్సు యాత్రలు చేసిన వీరే పార్టీని చూసుకున్నారు. అయితే 2014 ఎన్నికల్లో విజయం అవి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల వైపు రాలేదు గానీ జగన్మోహన్ రెడ్డి తరఫున 2019లో ప్రచారానికి వచ్చారు. షర్మిల కూడా జగన్ తరుపున ప్రచారం చేశారు.

2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన తల్లిని చెల్లిని దూరం పెట్టిన సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే తల్లి నీ చెల్లిని జగన్ గెంటేసాడు అని చెప్పుకుంటారు. అప్పటినుండి షర్మిల కూడా నే ఉన్నారు విజయమ్మ. వైయస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించినప్పుడు షర్మిల పార్టీలో కూడా విజయమ్మ కీలకంగా ఉన్నారు. అయితే తాజాగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష రాజకీయాలు షర్మిల కీలక పాత్ర పోషించనున్నారు. కొడుకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కూతురు షర్మిల కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి విజయమ్మ మీదే పడింది. ఇప్పుడు విజయమ్మ దారి ఎటు అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటివరకు ఉన్నట్లు షర్మిల వెంటే విజయమ్మ నడుస్తారా… లేక కొడుకు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారా అనేది ఊహకందకుండా ఉన్నది.

 

తన బిడ్డలు ఇద్దరు రాష్ట్రం కోసం కష్టపడతారని ఇద్దరూ పోటీపడే పరిస్థితి రాదని చెప్పిన విజయమ్మ ఇప్పుడు అదే పరిస్థితి రావడంతో ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. తెలంగాణలో షర్మిల కూడా ఉన్నప్పుడు ఆ రాష్ట్రం తోటి ఆ పార్టీ తోటి మాకు సంబంధం ఏంటి అని విజయమ్మ కుండ బద్దలు కొట్టారు. అయితే ఇప్పుడు కూతురు కూడా మళ్లీ ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి కొంపలో కుంపటిలా మారింది. ఒకవేళ విజయమ్మ కూడా క్షేమంగా వెంట నడిస్తే అది జగన్ కి కోలుకోలేని దెబ్బ అవుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదు అని సర్వేలన్ని చెబుతున్నాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం అది జగన్మోహన్ రెడ్డికి మైనస్ గా చెబుతుంటే ఇప్పుడు విజయం కూడా షర్మిల వెంట నడిస్తే జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఘోర పరాజయం అనేది ఎదురవుతుంది. ఇది ముందే ఊహించిన జగన్మోహన్ రెడ్డి విజయమ్మ దగ్గరికి షర్మిల దగ్గరికి రాయబారాలను పంపుతున్నారు. అయితే షర్మిల ఎవరి మాట వినే పరిస్థితి లేదని అంటున్నారు. రాజకీయాల్లో కీలకంగా ఉండే వైఎస్ కుటుంబంలోనే ఇప్పుడు రాజకీయాలు జరగడం నిజంగా ఆశ్చర్యమే.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -