Jagan: దూత వల్ల జగన్ కు లాభం జరుగుతుందా.. విజయమ్మ కాపాడతారా?

Jagan: వైయస్సార్ కుటుంబంలో చీలికలు మొదలయ్యాయి అనడానికి నిలువెత్తు నిదర్శనం షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరడమే అని చెప్పాలి. తెలంగాణలో పార్టీ స్థాపించిన వైయస్ షర్మిల పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేశారు. అనంతరం ఈమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమితులవడంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ అధికార ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.

 

గత ఎన్నికలలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ అన్న పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేసినటువంటి షర్మిల ఇప్పుడు అన్న ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ శత్రువులతో చేతులు కలిపి జగన్ పై విమర్శల వర్షం కురిపిస్తుంది. ఇక షర్మిలకు వైసిపి నేతలు గట్టిగా కౌంటర్ ఇవ్వలేని పరిస్థితిలు ఏర్పడ్డాయి. ఒకవైపు ఈమె వైఎస్ఆర్ కుమార్తె మరో వైపు జగన్ సోదరి పట్ల ఏమైనా గట్టిగా మాట్లాడితే రేపొద్దున వీరిద్దరూ కలిసిపోతారేమో మనకెందుకు ఈ తలనొప్పి అంటూ మౌనంగా ఉన్నారు.

ఇక షర్మిల మాట్లాడే ప్రతి మాటకు కూడా తన తల్లిని కేంద్ర బిందువుగా చూపిస్తూ మాట్లాడుతున్నారు అన్ని మాటలకు తన తల్లి సాక్ష్యం అంటూ ఈమె మాట్లాడటంతో తన తల్లి సపోర్ట్ తనకు ఉందని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇలాంటి తరుణంలోనే షర్మిలకు పులిస్టాప్ పెట్టాలి అంటే జగన్ నోరు విప్పాలి లేదా విజయమ్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి అని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.

 

ఈ క్రమంలోనే ఆదివారం వైయస్సార్సీపీ పార్టీ పెద్దగా వ్యవహరిస్తున్నటువంటి ఒక పెద్దాయన హైదరాబాద్లోని విజయమ్మను కలిసారని, వీరి మధ్య జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి వివరించడమే కాకుండా వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని కోరారట అయితే ఒకవైపు కొడుకు మరొకవైపు కూతురు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులలో విజయమ్మ ఉన్నారని తెలుస్తోంది. మరి వైసీపీ పార్టీకి మద్దతు లభించడం కోసమే వైసిపి పెద్దలు విజయమ్మను కలుస్తున్నారని తెలుస్తోంది. మరి విజయమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎవరికి మద్దతు తెలియజేస్తారన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -