YS Jagan: రైతుల కోసం జగన్ సర్కార్ అలా చేయనుందా.. ఏం జరిగిందంటే?

YS Jagan: ఏపీలో రైతుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది.. అకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన పంటలు ఉన్న కోల్పోయి రైతులు లబోదిబోమంటున్నారు. అయితే పంటలు కోల్పోయి బాధపడుతున్న రైతులను కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటూ రైతులు మండిపడుతున్నారు. ఇది ఇలా ఉంటే రైతుల కోసం అండగా ఉండటం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. గోదావరి జిల్లాల్లో అకాల వర్షంతో దెబ్బతిన్న రైతును పరామర్శించనున్నారు. కడియంలో అకాల వర్షాలతో పాడైపోయిన పంటలు, మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించనున్నారు.

కొత్తపేట అవిడి గ్రామంలో వరి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. పి.గన్నవరం మండలం రాజులపాలం గ్రామంలో మొక్కజొన్న రైతులతో మాట్లాడి భరోసా ఇవ్వనున్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఓజీ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే అకాల వర్షాల కారణంగా తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయినప్పటికీ ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడంతో రైతులకు మద్దతుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. చివరి క్షణంలో ఖరారైన పర్యటన అయినప్పటికీ జనసైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో కడియం మండంలలో జనసేన పార్టీ విజయం సాధించింది. తడిచిన ధాన్యం కొనుగోలుకు అధికారులు నిబంధనల పేరుతో జాప్యం చేస్తున్నారు. మొలక వచ్చిందని, రంగు మారిందని, తేమ శాతం అధికంగా ఉందని చెప్తుండడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తామని రైతులు అంటున్నా అధికారుల్లో స్పందన లేదు. తేమ శాతం, నూక, తాలు పేరిట మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ క్వింటాలుకు రూ.150 నుంచి రూ.300 చొప్పున వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ పర్యటించే ప్రాంతాల్లో రాత్రికి రాత్రే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రయత్నించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. మరి పవన్ కళ్యాణ్ రైతులకు న్యాయం చేస్తారా లేదా అన్నది చూడాలి మరి.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -