Prabhas-Tarak: ప్రభాస్, తారక్ ఫ్యాన్స్ కలను జక్కన్న నిజం చేయనున్నారా?

Prabhas-Tarak: టాలీవుడ్ దర్శకధీరుడు అయిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తాజాగా జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ బరిలో దింపే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబు సినిమాపై స్క్రిప్ట్ వర్క్ చేయనున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు చాలా టైమ్ పట్టేట్లుంది. ఈలోపు తన తదుపరి సినిమా గురించి చర్చ ప్రారంభమైంది.

 

జక్కన్న మహేష్ బాబు సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ కాంబోలో ఓ సినిమా చేయబోతున్నాడని వినిపిస్తోంది. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందనే గాసిప్ కలకలం రేపుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ లను కలిపిన రాజమౌళి మరో ప్రయత్నంగా ఎన్టీఆర్, ప్రభాస్ లను కలిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

 

టాలీవుడ్ లో ఎన్టీఆర్, ప్రభాస్ లతో రాజమౌళికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ తో నాలుగు సినిమాలు, ప్రభాస్ తో మూడు సినిమాలు చేశారు. రాజమౌళి తలచుకుంటే వాళ్ళిద్దరినీ కలపడడం పెద్ద పనేమీ కాదని టాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న మల్టీస్టారర్ ప్రచారం మాత్రం అంత నమ్మేట్టు కనిపించడం లేదు.

 

జక్కన్న ఓ మూవీ చేసే టైంలో ఇంకో సినిమాను అస్సలు చేయడు. తన తదుపరి సినిమా గురించి కూడా అస్సలు ఆలోచించడు. పైగా ఇంకా మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ కూడా ఇంకా తయారు కాలేదు కాబట్టి ఆ సినిమా మొదలై పూర్తి అయ్యేందుకు ఇంకా చాలా సమయం పట్టేట్టుగా ఉంది. అది పూర్తి కావడానికి దాదాపు మూడేళ్లు పట్టేట్టు ఉంది. రాజమౌళి ఆలోచనలు ఊహించడానికి కష్టం. ‘మగధీర’ సినిమా తర్వాత ఆయన ఏ స్టార్ తో సినిమా చేస్తాడో అనుకుంటే అందరూ ఊహించని విధంగా సునీల్ తో ‘మర్యాద రామన్న’ సినిమా చేసి ఆశ్చర్యపరిచాడు. ఇక ‘బాహుబలి’ తర్వాత ఎన్టీఆర్ తో ‘గరుడ’ చేస్తానని చెప్పిన జక్కన్న సర్ ప్రైజింగ్ గా ఎన్టీఆర్, చరణ్ తో ‘ఆర్ఆర్ఆర్’ చేశాడు. మహేష్ సినిమా తర్వాత జక్కన్న ఎవరితో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడో వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -