Jayasudha: ఆ విదేశీయుడినే జయసుధ మూడో పెళ్లి చేసుకోనుందా?

Jayasudha: తెలుగు ప్రేక్షకులకు నటి జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈతరం ప్రేక్షకులకు సుపరిచితమమే. ఎన్నో సినిమాలలో నటించి సహజనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది జయసుధ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఈమె ఇప్పటికీ సినిమాలలో నటిస్తూనే ఉంది. కాగా ప్రస్తుతం జయసుధ వయసు 6పదుల వయసు దాటి ఏడు పదుల వయసుకు చేరువుగా ఉన్నప్పటికీ ఈమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే కొంతకాలం కిందట జయసుధ భర్త మరణించిన విషయం తెలిసిందే. భర్తను కోల్పోవడంతో ఒంటరిగా కొడుకుతో కలిసి జీవిస్తోంది. అయితే ఇప్పుడిప్పుడే ఆమె సినిమాలలో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్న ఇటువంటి సమయంలో జయసుధ ఏడు పదుల వయసులో పెళ్లికి సిద్ధపడుతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య జయసుధ ఎక్కడ కనిపించినా, ఆమె వెంట ఒక అమెరికన్ వ్యక్తి ఉంటున్నాడు. అయితే ఎట్టకేలకు ఈ వార్తలపై జయసుధ స్పందించింది. ఆ వ్యక్తి ఎవరో కూడా క్లారిటీ ఇచ్చేసింది.

 

అతను అమెరికాకు చెందిన వ్యక్తి అని, తన బయోపిక్ తీసేందుకే ఇండియాకు వచ్చారు అని, జయసుధ స్పష్టం చేసింది. ఇండస్ట్రీలో తన ప్రాముఖ్యత గురించి తెలుసుకునేందుకు ప్రతి ఈవెంట్ కు హాజరవుతున్నారని ఆమె వెల్లడించింది. అతని పేరు ఫెలిఫే రూయేల్స్ అని తన బయోపిక్ తీస్తున్నారని, గతంలో ఆమె అమెరికా వెళ్ళినప్పుడు తన గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంటర్నెట్లో తెలుసుకున్నాడు. కానీ నాకు ఫాలోయింగ్ ఎలా ఉంది ?నా సినిమాలో, షూటింగ్స్ ల వివరాలు తెలుసుకోవడానికి నన్ను ఫాలో అవుతున్నాడే తప్ప ఇందులో ఇంకేమీ లేదు. ఇటీవల నేను అమెరికా వెళ్లి అతడిని కలిసాను అంటూ చెప్పుకొచ్చారు జయసుధ.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -