Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ అడుగు పెడితేనే టీడీపీకి పూర్వవైభవం వస్తుందా?

Jr NTR: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి తారాస్థాయిలో నడుస్తోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఫైట్ టైట్ గా ఉంది. వచ్చే ఎన్నికల్లో పక్కాగా పొత్తులతోనే వెళ్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుండబద్ధలుకొట్టి చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూడా పవన్ తో కలిసి వెళ్లేందుకు సముఖుత వ్యక్తం చేస్తుంది. అయినప్పటికీ టీడీపీ గెలుస్తుందా అనే నమ్మకం తెలుగు తమ్ముళ్లల్లో లేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాలని చెబుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి ఓ చరిత్ర ఉంది. అప్పట్లో ఇందిరాగాంధీ హవాని ఎదుర్కొని తెలుగువాడి సత్తా ఢిల్లీ కోటపై వినిపించారు దివంగత ఎన్టీరామారావు. ఆ తర్వాత ఆ పార్టీలో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. 2019 లో విభజిత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఆ తర్వాత జగన్ వేసే ఎత్తుల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది.
రాజకీయంగా, ఆర్థికంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఆ దాటిని చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ తట్టుకోలేపోతున్నారు.

 

రాష్ట్రంలో ఇప్పుడు కొన్నిచోట్లనే టీడీపీ బలంగా ఉందని చెప్పవచ్చు. రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికీ జగన్ హవానే కొనసాగుతోంది. ఇక్కడ టీడీపీకి పూర్వవైభవం రావటం కష్టమని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్రలోనూ వైసీపీ గాలినే వీస్తుందని సర్వేలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, ఎన్నికల నాటికి పుంజుకోవాలంటే పక్కాగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఎంటర్ కావాలని సంకేతాలు బలంగా వినిపిస్తున్నారు.

 

ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్టీ ఆపదలో ఉందంటే పక్కగా సాయపడుతారు. గతంలోనూ వచ్చారు కూడా. ఈ క్రమంలోనే ఆ సారి పక్కగా ఏపీలో జూనియర్ తిరగాలని తెలుగు తమ్మళ్లు కోరుకుంటున్నారు. ఒకవేళ జూనియర్ రాకపోతే పార్టీ గెలవటం కష్టం అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోతే, తెలుగుదేశం పార్టీలో నాయకులెవ్వరూ మిగలరని అంటున్నారు. మరి జూనియర్ ఎప్పుడు వస్తారో, టీడీపీ ఎప్పుడు పూర్వవైభవం తెస్తారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -