Revanth Reddy: రేవంత్ రెడ్డి ఆదేశాలతో కుమారి ఆంటీ రేంజ్ మరింత పెరుగుతుందా?

Revanth Reddy: ఫుట్ పాత్ పక్కన ఫుడ్ స్టాల్ పెట్టి ఎంతో పాపులర్ అయినటువంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు. ఈమె తన జీవనోపాధి కోసం ఫుట్ పాత్ పక్కన వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తూ ఉన్నారు. ఇక ఈమె చేసే ఫుడ్ రుచి కూడా ఉండడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి కస్టమర్లు వచ్చి ఈమె చేతి వంట రుచి చూసేవారు అయితే సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈమె భారీ స్థాయిలో పాపులర్ అయింది.

 

ఈమె మాట తీరును కొంతమంది రీల్స్ చేసి పెట్టడంతో మరింత పాపులారిటీ వచ్చింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఈమె ఫుడ్ టేస్ట్ చేసేవారు. దీంతో ట్రాఫిక్ కష్టాలు కూడా మొదలయ్యాయి. ఉదయం సాయంత్రం ట్రాఫిక్ భారీగా జామ్ అవడంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈమె ఫుడ్ స్టాల్ మూసివేశారు.

సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ అయినటువంటి కుమారి ఆంటీ అదే పాపులారిటీతో తన ఫుడ్ స్టాల్ మూసేసి పరిస్థితికి వచ్చింది. ఇలా ఈమె ఫుడ్ స్టాల్ మూసివేయడంతో ఎంతోమంది తనకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించారు.

 

ఫుట్ పాత్ పక్కన ఫుడ్ అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నటువంటి కుమారి ఆంటీ విషయంలో ఎందుకు జోక్యం చేసుకున్నారని ఫుట్ పాత్ పక్కన వ్యాపారం చేసుకునే వారిని చూసి చూడనట్టు వదిలేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇలా సీఎం ఆదేశాలు రావడంతో ఆమె ఫుడ్ స్టాల్ కు స్వల్ప మొత్తంలో ఫైన్ వేసి అధికారులు యధావిధిగా తాను ఫుడ్ స్టాల్ నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చారు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈమె ఫుడ్ స్టాల్ బిజినెస్ తెరుచుకుందనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -