Lokesh: ఆ నేతల విషయంలో లోకేశ్ ఇంత కఠినంగా వ్యవహరించనున్నారా?

Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్రను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ కడప జిల్లాలో ఈ పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని తాజాగా ఈ యువగలం పాదయాత్రలో భాగంగా సీనియర్ టీడీపీ నేతలకు గట్టి షాక్ ఇచ్చారు లోకేష్. ఒక‌వైపు టికెట్లు ఇచ్చేది చంద్ర‌బాబే అని అంటూనే, ప‌రోక్షంగా త‌న వ‌ర్గీయుల‌ను లోకేశ్ ఎక్క‌డిక‌క్క‌డ అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టిస్తున్నారు. దీంతో ప్రస్తుతం టీడీపీలో చర్చలు మొదలయ్యాయి.

టీడీపీలో ఒక‌రికి టికెట్‌, మిగిలిన అశావ‌హులు దూర‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇది పార్టీకి న‌ష్టం తీసుకొస్తోంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ప్రొద్దుటూరులో ప్ర‌వీణ్‌ రెడ్డికే టికెట్ అని లోకేశ్ ప‌రోక్షంగా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీంతో మాజీ ఎమ్మెల్యేలు అయిన టీడీపీ సీనియ‌ర్ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర ప్ర‌స్తుతం క‌డ‌ప‌లో సాగుతోంది. 113వ రోజు ప్రొద్దుటూరులో పాద‌యాత్ర సాగింది. ప్రొద్దుటూరు శివాల‌యం సెంట‌ర్‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో లోకేశ్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త ఇచ్చారు.

 

కాగా బహిరంగ సభలో లోకేష్.. ప్రొద్దుటూరు పౌరుషాన్ని నిల‌బెట్టింది ప్ర‌వీణ్. మీ త‌ర‌పున పోరాడినందుకు 29 రోజులు జైలు కెళ్లింది ఈ ప్ర‌వీణ్. సుబ్బ‌య్య‌ను అతి కిరాత‌కంగా చంపేస్తే అండ‌గా నిల‌బ‌డింది ఈ ప్ర‌వీణ్‌. ప్రొద్దుటూరు ప్ర‌శాంతంగా వుండాలంటే ఈ గడ్డ‌పై ప‌సుపు జెండా ఎగ‌రాలి. ఇది యువ‌గ‌ళం. రేపు 40 సీట్లు యువ‌త‌కే ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఈ వేదిక‌పై నుంచి యువ పౌరుషాన్ని నేను చూశాను. యువ‌ర‌క్తం నేను చూశాను. రేపు ఇక్క‌డ యువ‌త‌ను గెలిపించాల్సిన బాధ్య‌త మీ అంద‌రిపై కూడా వుంది అని తెలిపారు లోకేష్. లోకేష్ మాటలకు టిడిపి సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -