Mahesh: ఇప్పటివరకు చేతకానిది మహేష్ చేసి చూపిస్తారా.. ఏం జరిగిందంటే?

Mahesh: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక దీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎస్.ఎస్ రాజమౌళి సినిమాలు అంటే ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమైనటువంటి ఈయన సినిమాల హవా అనంతరం పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం రాజమౌళి సినిమా అంటే పాన్ వరల్డ్ స్థాయిలో కూడా భారీగానే అంచనాలు ఏర్పడతాయి.

ఈ విధంగా రాజమౌళి సినిమా అంటే భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. ఇక ఆ సినిమా కోసం హీరోలు ఎన్ని డేట్స్ ఇవ్వడానికైనా సిద్ధంగానే ఉంటారు. ఒక్కసారి రాజమౌళి చేతిలోకి హీరో పడ్డారు అంటే దాదాపు రెండు మూడు సంవత్సరాలు వారు బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఇక ఈ సినిమా కూడా అదే స్థాయిలో మంచి సక్సెస్ అందుకుంటుంది. అయితే రాజమౌళి సినిమా అంటే హీరోలకు ఒక పరీక్ష లాంటిదే.

 

రాజమౌళి ఒక సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమాలో తన హీరో ఎలా ఉండాలి అనే విషయాన్ని పూర్తిగా హీరోలకు చెప్పేస్తారు. అందుకు అనుగుణంగానే వారి శరీరాన్ని కూడా మార్చుకోవాలని ఈయన వారికి సూచించి తనకు కావలసిన ఔట్ పుట్ తెప్పించుకుంటారు. ఇదివరకు ఈయనతో పని చేసిన రాణా ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి వారందరూ కూడా బాగా వర్కౌట్స్ చేశారు.

 

ప్రస్తుతం మహేష్ బాబు వంతు వచ్చింది ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎలాంటి లుక్ లోకనిపించాలి అనే విషయాన్ని రాజమౌళి ఇదివరకే మహేష్ బాబుకు తెలియజేశారు. ఈ సినిమాలో మహేష్ సిక్స్ ప్యాక్ లేదా 8 ప్యాక్ తో అయినా కనిపించిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. రాజమౌళి చెప్పిన విధంగానే ఇప్పటికే మహేష్ బాబు ప్రత్యేకంగా జిమ్ ట్రైనర్ సమక్షంలో భారీగా వర్కౌట్స్ చేస్తున్నారు. సినిమా కోసం ప్ర‌త్యేకంగా స‌న్న‌ద్ధం అవ్వ‌డం, బాడీ బిల్డ్ చేయ‌డం మ‌హేష్ ఇప్ప‌టి వ‌రకూ చేయ‌లేదు. కానీ ఇది రాజ‌మౌళి సినిమా క‌దా, ఈసారికి త‌ప్ప‌డం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -