Nagababu: ఆ పదవి వల్ల నాగబాబు జనసేన జాతకాన్ని మార్చనున్నారా?

Nagababu: సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. జనసేన పార్టీని స్థాపించి జనసేన పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగుతున్నారు. అయితే ప్రస్తుతం పవన్ వరుసగా సినిమాలకు కమిట్ అవటంవల్ల రాజకీయాలపై ఫోకస్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాదిలో సినిమాలన్నీ పూర్తి చేసుకొని పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టే ఆలోచనలో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈయన పార్టీకి కాస్త దూరంగా ఉండటంతో పార్టీ వ్యవహారాలన్నిటిని చెక్క దిద్దడం కోసం తన అన్నయ్య నాగబాబుకు కీలక పదవిని అప్పచెప్పారు. నాగబాబు ఇన్ని రోజులు జనసేన పార్టీలో రాజకీయ వ్యవహార కమిటీ సభ్యుడిగా మాత్రమే ఉన్నారు. అయితే తాజాగా ఈయనకి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పజెప్పారు. ఇలా ఈ పదవి అందుకున్నారు అంటే జనసేన పార్టీలో నాగబాబు నెంబర్ 2 అని అర్థం.


పార్టీ నాయకుడు తర్వాత కీలకమైన పదవి ప్రధాన కార్యదర్శి పదవి అని చెప్పాలి. ఇక నాయకుడికి అన్ని వ్యవహారాలు చక్కదిద్దే అంత సమయం ఉండదు కనుక పార్టీ వ్యవహారాలన్నింటినీ పార్టీ ప్రధాన కార్యదర్శి చక్క దిద్దే పనిలో ఉంటారు.ఇక ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గత కొంతకాలంగా ఆయనే పార్టీ వ్యవహారాలన్నింటిని చూసుకుంటూ చక్కబెడుతున్నారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ ప్రధాన కార్యదర్శి పదవిని నాగబాబుకు అప్పజెప్పినట్లు తెలుస్తుంది.

 

నాదెండ్ల మనోహర్ పార్టీ వ్యవహారాలన్నింటిని చూసుకుంటూ ఉండగా నాగబాబు పార్టీతరపున జిల్లాలలో పర్యటిస్తే జనసేన పార్టీకి భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుందని పలువురు భావిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బయటకు వచ్చే ప్రసక్తి లేకపోవడంతో ఇదే విషయాన్నిదృష్టిలో పెట్టుకొని నాగబాబుకు ఈ పదవి అప్పచెప్పి ఉంటారని తెలుస్తోంది. మరి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు పార్టీని చక్క దిద్ది జనసేన తలరాతను మారుస్తారా వచ్చే ఎన్నికలలో జనసేన విజయాన్ని అందుకునేలా కృషి చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -