Pawan Kalyan: ఓపిక నశిస్తే పవన్ కళ్యాణ్ అన్ని సీట్లు మాత్రమే అడుగుతాడా?

Pawan Kalyan: 2024లో రాష్ట్ర ఎన్నికలు జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో ఇప్పటి నుంచే ఎన్నికల కు సంబంధించిన వేడి మొదలైంది. పార్టీల మధ్య మాటల యుద్ధాలు నడుస్తున్నాయి. కాగా వైసిపి పార్టీ తప్పకుండా గెలుస్తామని దీమాని వ్యక్తం చేస్తుండగా టిడిపి జనసేన ఎలా అయినా గెలవాలి అన్న కసితో ఉన్నారు. ఇప్పటికే వైసీపీని ఎదురుకోలేము అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ బయటకు చెప్పేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మాత్రం బయటపడటం లేదు. దీంతో చాలామంది పవన్ ని విమర్శిస్తూ ప‌వ‌న్‌కు రాజ‌కీయ ప‌రిప‌క్వ‌త లేక‌పోవ‌డంతో త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

 

అయితే నిజానికి ప‌వ‌న్‌తో చంద్ర‌బాబుకు రాజ‌కీయ అవ‌స‌రం చాలా వుంది. ఎన్నిక‌లకు రెండు మూడు నెల‌ల ముందు వ‌ర‌కూ ప‌వ‌న్ స్వ‌తంత్రంగా రాజ‌కీయం చేసి వుంటే క‌థ వేరేలా వుండేది. కానీ సీఎం జ‌గ‌న్‌పై పెంచుకున్న విద్వేషాగ్ని ఆయ‌న్ను ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌లేదు. చంద్ర‌బాబు కంటే ప‌వ‌నే ఎక్కువ‌గా రెచ్చిపోతున్నారు. జ‌గ‌న్‌ను గ‌ద్దె దించే బాధ్య‌త‌ను తానే తీసుకుంటాన‌ని ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌క‌టించారు. కానీ ప‌వ‌న్ చేస్తున్న రాజ‌కీయ కార్య‌క‌లాపాలేవీ లేవు. ఈ నేప‌థ్యంలో బీజేపీ నుంచి విడిపోవ‌డానికి, అలాగే చంద్ర‌బాబుతో క‌ల‌వ‌డానికి ప‌వ‌న్‌కు ఒక బ‌ల‌మైన సాకు కావాలి.

 

మ‌రోవైపు చంద్ర‌బాబు, ప‌వ‌న్ కోరుకున్న‌ట్టుగానే వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌పై రాళ్లు రువ్వ‌డం, ఇందుకు మంత్రి సురేష్ నాయ‌క‌త్వం వ‌హించ‌డం గ‌మ‌నార్హం. బాబు ప‌ర్య‌ట‌న‌పై రాళ్లు రువ్వ‌గానే, తానున్నానంటూ ప‌వ‌న్ క‌ల్యాన్ ర‌య్‌మంటూ ముందుకొచ్చారు. విశాఖ‌లో త‌న‌పై కూడా అధికారాన్ని ఉప‌యోగించి అణిచివేత చ‌ర్య‌లు చేప‌ట్టారంటే ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబుపై రాళ్ల దాడిని ప‌వ‌న్ ఖండించారు. ఏపీలో బాబు, పవన్ కళ్యాణ్ కోరుకున్నదే ఏపీలో జరుగుతున్నాయా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కు ఓపిక నశిస్తే 20 సీట్లు అడుగుతాడు అన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -