Pawan Kalyan: వాళ్ల జాతకాన్ని పవన్ కళ్యాణ్ మారుస్తారా.. అదే జరగబోతుందా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజెపి పార్టీతో పొత్తుకు సిద్ధమైన విషయం మనకు తెలిసిందే. అయితే గత కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్ర నేతలతో సుదీర్ఘ కాలం పాటు సమావేశమై పలు కీలక విషయాల గురించి చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా భారతీయ జనతా పార్టీ తరపున అన్ని రోడ్ మ్యాప్‌లు ఇచ్చేశామని ఏపీ బీజేపీ సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ స్పష్టం చేశారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ప్రతిభ పోటీ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.

ఈ కార్యక్రమం అనంతరం సునీల్ దియోధర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ కు చేరవలసిన అన్ని రోడ్ మ్యాప్స్ చేరాయని స్పష్టం చేశారు. ఇక ఇందుకు సంబంధించిన ఇంకా ఏదైనా విషయాలు వివరాలు కావాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించాలని సునీల్ పేర్కొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బిజెపి పోటీ చేస్తామని చెబుతున్న పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా కూడా బిజెపి నేతలతో కలిసి కనిపించడం లేదు.

 

ఇకపోతే బిజెపి నేతలతో కలిసి ఎక్కడ కూడా ఈయన పార్టీ గురించి చర్చించిన దాఖలాలు లేవు. ఇక కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొంటారని వార్తలు కూడా వచ్చాయి అయితే అది కూడా అవాస్తవమని తేలిపోయింది.ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ తో రెండు సార్లు సమావేశం అయ్యారు. జేపీ నడ్డాతో ఒక్క సారి సమావేశం అయ్యారు. అయితే గతంలో ప్రచారం వెళ్లడానికి బిజెపి రోడ్డు మ్యాప్ ఇవ్వలేదని తెలిపినటువంటి పవన్ కళ్యాణ్ కు ప్రస్తుతం అన్ని రోడ్ మ్యాప్స్ వచ్చేసాయి.

 

ఇలా రోడ్ మ్యాప్స్ తన చేతికి అందడంతో ఇకపై ఈయన జనాలలోకి వస్తారని అధికార నేతల భరతం పడతారని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మరి పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నదే సస్పెన్స్ గా మారింది. ఎన్నికల వేడి పెరుగుతున్నా ఆయన ఇంకా జనాల్లోకి రాకుండా తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల విషయంలో ఏ విధమైనటువంటి వ్యూహాలు రచించారు వాటిని ఎలా అమలు చేయబోతున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -