Pawan Kalyan: రాయలసీమ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా.. అసలు లెక్క ఇదే!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారన్న విషయం గురించి పెద్ద ఎత్తున ఆతృత నెలకొంది. అయితే ఈయన గోదావరి జిల్లాల నుంచి పోటీ చేస్తారని ఒకసారి కాదు తిరుపతి నుంచి పోటీ చేయబోతున్నారని మరోసారి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈయన తిరుపతి నుంచి పోటీకి దిగితే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే నియోజకవర్గాలలో తిరుపతి కూడా ఒకటి.

గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి తిరుపతి నియోజకవర్గం నుంచి పోటీ చేసే గెలుపొందారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇక తిరుపతిలో కాపు ఓట్లు కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో పవన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని తెలుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయరని సమాచారం.

 

ఆయ‌న కోస్తా నుంచే బ‌రిలో దిగనున్నార‌ని వారాహి యాత్ర‌తో తేలిపోయింది. ఇక తిరుప‌తి ఎవ‌రికి? అనే ప్ర‌శ్న మొద‌లైంది. ప‌వ‌న్ పోటీ చేయ‌క‌పోతే తిరుప‌తి టికెట్ త‌న‌కు ద‌క్కుతుంద‌ని కిర‌ణ్ రాయ‌ల్ అంటున్నారు. కానీ కిరణ్ రాయల్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని వ్యతిరేకవర్గం చెబుతుంది. ఈ క్రమంలోనే పార్టీ రాజకీయ వ్యవహారాల క‌మిటీ స‌భ్యుడు, జిల్లా అధ్య‌క్షుడు ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్‌కే తిరుపతి నుంచి పోటీ చేయడానికి టికెట్ లభిస్తుందని అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా హరిప్రసాద్ పేరు మారిపోతుంది అదే విధంగా ఈయన పోటీ చేస్తే కచ్చితంగా గెలుపొందుతారని కూడా తెలుస్తుంది. ప్ర‌స్తుత ప‌రిణామ‌లు చూస్తుంటే ఆయ‌న‌కే టికెట్ ద‌క్కే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం భావిస్తున్నారు మరి జనసేన మనసులో ఏముంది?తిరుపతి టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -