Raghurama Krishnamraju: రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా.. ఏ దిక్కు లేకపోతే అ పార్టీనే దిక్కవుతుందా?

Raghurama Krishnamraju: ఏపీలో రఘురామకృష్ణం రాజు ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నారు. నిజానికి గత నాలుగేళ్లు ఏపీ రాజకీయాల్లో ఆయన ట్రెండ్ అవుతూనే ఉన్నారు. వైసీపీ ఎంపీల పేర్లు గుర్తు చేసుకోవాల్సి వస్తే ఆయన దగ్గరే ఎవరైనా మొదలు పెడతారు. ఎందుకంటే వైసీపీ ఎంపీలు అంటే ఆయన ఒక్కరే గుర్తు వస్తారు. ఆయన ఒక్కరే ఆయన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేసేవారు. మిగిలిన వారి పేర్లు కూడా చాలా మందికి తెలియదు. ఎంపీగా గెలిచిన కొన్నాళ్లకే ఆయన వైసీపీతో విభేదించి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకిస్తూ వచ్చారు. నిజానికి ఓ దశలో ప్రతిపక్షం కూడా ఆయనలా పోరాటం చేయలేదు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయంలోనూ ఉన్న లోపాలను ఎత్తి చూపించారు. ఏపీలో ప్రభుత్వంపై వ్యతిరేక స్వరం వినిపించడం ఆయనతోనే మొదలైంది. ఆయన ఇచ్చిన స్పూర్తితో ఒక్కొక్కరుగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు.

ఎన్నికల ముందు ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత వ్యక్తం అవుతుందంటే దానికి రఘురామకృష్ణంరాజే పునాదులు వేశారని చెప్పాలి. దీంతో.. ఆయన్ని ప్రభుత్వం ఓ కేసులో అరెస్ట్ చేసింది. అప్పుడు ఆయనపై పోలీసులు థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని ఓ ఆరోపణ ఉంది. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లి అక్కడే మకాం వేశారు. ఏపీకి వస్తే వైసీపీ వాళ్లు దాడులు చేస్తారని రాలేదు. ఇటీవల సంక్రాంతి పండగకు వచ్చారు. అది కూడా ఎన్నికలు దగ్గర పడ్డాయి కనుక వచ్చారు. ఈ నాలుగేళ్లు కూడా ఆయన ఢిల్లీ నుంచే వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేశారు. ఆయన ఢిల్లీలో ఉన్నప్పటికీ మరోసారి ఎంపీగా నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెబుతూ వచ్చారు. బీజేపీ, టీడీపీ, జనసేనలో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. కానీ, నర్సాపురం ఎంపీ స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి వచ్చింది. కానీ, బీజేపీ ఆయన పేరును ప్రకటించలేదు. దీంతో.. కేంద్రంతో ఉన్న సత్సంబంధాలతో జగనే తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అయితే, ఎన్నికల వరకూ ఆయన ప్రతిపక్షాల్లో ఏ పార్టీలోనూ చేరకుండా మధ్యలో ఉండిపోయారు. దీంతో టికెట్ రాలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

కారణం ఏదైనా ఆయనకు టికెట్ రాకపోవడంతో ప్రస్తుతం ఆయన హాట్ టాపిక్ గా మారారు. ఆయనకు టికెట్ దక్కాలని చాలా మంది పూజలు కూడా చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేగా ఆయనకు టీడీప తరుఫున అవకాశం రావొచ్చనే చర్చ నడుస్తోంది. కానీ, టీడీపీ ఒక్క సీటును కూడా వృధా చేసుకునే ఆలోచన లేనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆశావహులు టీడీపీలో ఎక్కువ మంది ఉన్నారు. దీంతో.. టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ దక్కే ఛాన్స్ లేదు. దీంతో.. ఆయనకు ఉన్న ఒకేఒక్క ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ. అందులో చేరితే నర్సాపురం నుంచి కాంగ్రెస్ తరుఫున పోటీ చేయొచ్చని చాలా మంది ఆయనకు సలహాలు ఇస్తున్నారు. నర్సాపురం ఓటర్లు ఆయన పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఆయన ఏ పార్టీ తరుఫున పోటీ చేసినా గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఆయన్ని జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. పైగా నర్సాపురం వైసీపీ, బీజేపీ అభ్యర్థులు అంత బలమైన నేతలు కాదు. దీంతో, ఆయన కాంగ్రెస్ లో చేరితే గెలిచే అవకాశం ఉంది. పైగా వైసీపీపై కూటమి తరుఫున బీజేపీ పోటీ చేసినా ఎవరూ నమ్మడం లేదు.

ఎందుకంటే.. బీజేపీ, వైసీపీకి మధ్య సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు ఉన్నాయి. దీంతో నర్సాపురంలో వైసీపీపై పోరాటం చేసేవాళ్లు లేరని అక్కడి ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే.. కాంగ్రెస్ రఘురామకృష్ణం రాజు డెడ్లీ కాంబినేషన్ అని భావిస్తున్నారు. అటు, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు.. రఘురామకృష్ణంరాజుకి వియ్యంకుడు. కాబట్టి కాంగ్రెస్ లో చేరికకు కూడా పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు.

Related Articles

ట్రేండింగ్

Election Commission: పింఛన్ల పంపిణీలో ఈసీ కీలక ఆదేశాలు.. జగన్ సర్కార్ కు ఇక చుక్కలేగా!

Election Commission: ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది అయితే ప్రజలకు అందే సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే తీసుకువెళ్లారు అయితే...
- Advertisement -
- Advertisement -