Samantha: ఆ సినిమా కోసం సమంత అలాంటి డ్రెస్‌లో కనిపిస్తుందా?

Samantha: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమంత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలను మాత్రమే అంగీకరిస్తోంది. ఓ బేబీ, యశోద, శాకుంతలం సినిమాలలో సమంత ప్రధాన ఆకర్షణ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఇటీవల శాకుంతలం సినిమా నుంచి ఓ పోస్టర్‌ ద్వారా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ పోస్టర్‌లో సమంత చాలా రొమాంటిక్‌గా కనిపిస్తోంది. హీరో దేవ్ మోహన్‌తో కలిసి జాకెట్ లేకుండా కనిపించింది.

 

శాకుంతలం మూవీలో సమంత హాట్ హాట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజా పోస్టర్‌లో జాకెట్ లేకుండా సమంత కనిపించడంతో ఆమె అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న విడుదల కానుంది. గుణ టీమ్‌ వర్క్స్‌ పతాకంపై నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో శాకుంతలం సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల శాకుంతలం మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ త్రీడీ ఫార్మాట్‌లోనూ విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కావడంతోనే విడుదలలో జాప్యం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

 

అనారోగ్యం నుంచి కోలుకుంటున్న సామ్
కొద్దిరోజులుగా సమంత మయోటైటిస్ అనే కండరాల సమస్యతో బాధపడుతోంది. దీంతో చికిత్స కోసం ఆమె దక్షిణ కొరియా వెళ్తుందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. కొన్ని సినిమాల నుంచి సమంత తప్పుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ వదంతులు మాత్రమే అని సమంత టీమ్ కొట్టిపారేసింది. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న సమంత త్వరలోనే తిరిగి షూటింగులలో పాల్గొననుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -