TDP: కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశంకు డిపాజిట్లు కూడా దక్కవా.. జరగబోయేది ఇదేనా?

TDP: మరికొన్ని నెలలలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క పార్టీ నాయకుడు కూడా తామే అధికారంలోకి రావాలని పెద్ద ఎత్తున ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం అధినేతలు సైతం రాష్ట్రం మొత్తం టిడిపి హవా నడుస్తుందని వైసిపి పతనం మొదలైంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలలో తప్పకుండా తమ పార్టీని గెలుస్తుంది అనే ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో రెండు మూడు చోట్ల టిడిపి గెలవడంతో ఇక అధికారం మనదే అన్న అపోహలలో చంద్రబాబు నాయుడు ఉన్నారని, ఈ ఊహలలో నుంచి చంద్రబాబు బయటపడితేనే మంచిదని పలువురు తెలియజేస్తున్నారు. టిడిపి గెలవడం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంలో తెలుగుదేశం ఓడిపోవడం విడ్డూరంగా ఉందని పలువురో కామెంట్లు చేస్తున్నారు.

కుప్పం నియోజకవర్గంలో 6 వార్డులలో పంచాయతీ ఉప ఎన్నికలు జరగగా ఇందులో నాలుగు వార్డులలో వైసిపి గెలిచింది మరొక వార్డులో అధికార పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇక మిగిలిన ఒకచోట మాత్రమే తెలుగుదేశం పార్టీ వచ్చింది ఇలా తమ పార్టీ హవ మొదలైందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు కుప్పం పంచాయతీ ఉప ఎన్నికలలో ఎందుకు గెలవలేకపోయారన్నది మాత్రం మాట్లాడటం లేదు.

ఇలా సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు పార్టీకి పెద్దగా కలిసి రాకపోవడంతో వచ్చే ఎన్నికలలో కూడా చంద్రబాబు నాయుడుకు డిపాజిట్లు కూడా రావని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ పలువురు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగా వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు వై నాట్ 175 అనే దిశగానే గెలుపొందుతారా అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -