NTR: జూనియర్ ఎన్టీఆర్ సీఎం అయితే ఏపీ ప్రజల భవిష్యత్తు మారుతుందా?

NTR: ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. 2019లో ఎన్నికైన వైసీపీ ప్రభుత్వం దుర్మార్గాలకు అడ్డాగా మార్చిందని టీడీపీ, జనసేన పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. కేవలం సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు. రౌడీ రాజ్యంలో ఈ నాలుగేళ్లలో ఒక్క కంపెనీ కూడా రాలేదని వాపోతున్నారు. యువత ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత తీవ్రమైన ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటోంది. అభివృద్ధి పరంగా దేశంలోనే అట్టగు స్థానాన్ని భర్తీ చేసింది. దీంతో విభజన ఏపీకి మెుదట సీఎం అయిన చంద్రబాబు, అమరావతి రాజధానిగా ప్రకటించారు. అభివృద్ధి చేయాలని ఆకాంక్షించినట్లు తెలుగుదేశం పార్టీ చెబుతోంది. వాస్తవ పరిస్థితులు చూస్తే కియా సహా విశాఖ, గన్నవరం, తిరుపతి ప్రాంతాల్లో పలు కంపెనీలు వచ్చాయి. యువతకు ఉద్యోగ అవకాలు కూడా లభించాయి. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. సంక్షేమం మీదనే జగన్ దృష్టి పెట్టారు. డబ్బును మాత్రమే పంచుతున్నారని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. ప్రజలు కూడా దాన్ని బాగా నమ్ముతున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్రాన్ని కాపాడాలంటే ఓ కొత్త నాయకుడు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్.. టీడీపీ పగ్గాలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే త్వరలోనే తారక్, ఏపీలోకి అడుగుపెట్టి రాజకీయ ప్రచారం సాగిస్తారని తెలుస్తోంది. జూనియర్ వస్తేనే తమ పరిస్థితి కూడా మారుతోందని భావిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మగాడని ఏపీ ప్రజల భవిష్యత్తును మార్చే ఆలోచన ఉన్న వ్యక్తి అతనేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -