Number 23: 23 నంబర్ సెంటిమెంట్ ఇకపై వైసీపీ విషయంలో రిపీట్ కానుందా?

Number 23: ఏపీలో అధికార వైసీపీకి తెలుగు దేశం పార్టీ ఊహించని షాకిచ్చింది. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయం సాధించారు. దీంతో 2023 మార్చి 23వ తేదీన తమ అభ్యర్థి 23 ఓట్లు సాధించి విజయం సాధించడం నిజంగా దేవుడి స్క్రిప్టే అని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

23వ తారీఖు, 23 ఓట్లను కోట్ చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ఆనందం వ్యక్తం చేశారు. తాము 23 సీట్లే గెలిచామ‌ని సీఎం వైఎస్ జగన్ ఎద్దేవా చేశారని, అందులో న‌లుగురిని సంత‌లో ప‌శువుల్లా కొన్నారని వ్యాఖ్యానించారు.

 

2014లో వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మంది టీడీపీలోకి ఫిరాయించారు. వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి పదవులు సైతం ఇచ్చారు. ఈ క్రమంలో 2019 మే 23వ తేదీన వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ 23 సీట్లు మాత్రమే సాధించింది. దీనిపై అప్పట్లో సీఎం జగన్ సెటైర్లు వేశారు.

 

ఈ 23 మంది 2019లో టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్యే అయినా మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీడీపీ విజయం అద్భుతం వైసీపీకి దెబ్బ అని చెప్పాల్సిందే. ఇలా 2023 మార్చి 23వ తేదీ టీడీపీకి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 23 సీట్లు సాధించి ప్రతీకారం తీర్పుకుందని టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -