YCP: 2024లో వైసీపీ అధికారంలోకి వస్తే అదే జరుగుతుందా?

YCP: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలలో భాగంగా అధికారాన్ని దక్కించుకోవాలని పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కృషి చేస్తున్నాయి.ఈ క్రమంలోని 2024వ సంవత్సరంలో 175 స్థానాలలోను వైసీపీ జెండాను ఎగరవేస్తాము అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఊహించని విధంగా గెలుపొందడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలలో కూడా ఆశలు మొదలయ్యాయి.
వచ్చే ఎన్నికలలోపు ఎలాగైనా పార్టీని బలోపేతం చేసుకుని వచ్చే ఎన్నికలలో అధికారం దక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు జనసేన పార్టీ కూడా త్వరలోనే ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఇలా వచ్చే ఎన్నికలపై అన్ని పార్టీ నేతలు పెద్ద ఎత్తున పోటీకి సై అంటున్నారు. ఇకపోతే వచ్చే ఎన్నికలలో తిరిగి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వస్తే జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు లాభమా? నష్టమా?రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందా అనే విషయానికి వస్తే…
2024వ సంవత్సరంలో మరోసారి జగన్ అధికారాన్ని చేపడితే రాష్ట్ర అభివృద్ధి బాటలో పయనించే దిశగా పనులు చేయాలని భావించినట్లు తెలుస్తోంది.అయితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు అన్నింటిని కూడా ప్రజలకు ఇస్తారా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.అయితే జగన్ వచ్చే ఎన్నికలలో గెలుపొందిన ప్రజల సంక్షేమ ఫలాలను యధావిధిగా అందిస్తారని తెలుస్తుంది.
సంక్షేమ ఫలాలను అందించడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదని పలువురు భావిస్తున్నారు. అయితే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంతో అభివృద్ధి కుంటు పడుతుందని,ఈ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందో లేదో చెప్పలేమని మరికొందరు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అభివృద్ధి అంటే సంక్షేమ ఫలాలను అందించడమే కాదని మరికొందరు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరివచ్చే ఎన్నికలలో అధికారం అందుకున్నటువంటి జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -