YCP: మూడు రాజధానులే వైసీపీకి శాపం కానున్నాయా.. అవే 2024లో వైసీపీని ముంచనున్నాయా?

YCP: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రకి రోజురోజుకీ ప్రజాధరణ పెరిగిపోతుంది. లోకేష్ ఏ గ్రామంలో అడుగుపెట్టినా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ లోకేష్ కి స్వాగతం పలుకుతున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమ నుంచి ఇప్పుడే ఆంధ్ర లోకి ప్రవేశించాడు. ఈమధ్య మంగళగిరి నియోజకవర్గంలో అడుగు పెట్టాడు.

అయితే లోకేష్ మంగళగిరి నియోజకవర్గం లోకి అడుగుపెట్టాడో లేదో వైసీపీ శ్రేణులు తండోపతండాలుగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాయి. పలు వైసీపీ నాయకులు నారా లోకేష్ సమక్షంలో పచ్చ కండువా కప్పుకొని మా మద్దతు టీడీపీ కే అని లోకేష్ సాక్షిగా మాట ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో జాతీయ జెండా చేత పట్టుకుని సమైక్య వాక్ నిర్వహించారు.

 

ఆయన నడిచిన రెండున్నర కిలోమీటర్ల పొడుగునా వేలాదిగా జనాలు ఆయన వెంట నడిచి విజన్ 2047 ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తండ్రి, కొడుకులకి లభిస్తున్న ప్రజాదరణ చూస్తుంటే ప్రజలకి వైసీపీ ప్రభుత్వం పై నమ్మకం పోయినట్లుగా అర్థమవుతుంది. ఇటు రాయలసీమ గాని అటు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు గాని వైసీపీ చెబుతున్న మూడు రాజధానులు కథలను నమ్మటం లేదు. ఒకవేళ అదే ప్రజలు జగన్ ని నమ్మినట్లయితే నారా లోకేష్ కి అంత ప్రజాదరణ లభించి ఉండేది కాదు.

 

విశాఖ ప్రజలు తమ నగరమే రాష్ట్ర రాజధాని కావాలని కోరుకుంటున్నట్లయితే నిన్న చంద్రబాబు నాయుడు వెంట విశాఖ ప్రజలు నడిచేవారు కాదు. విశాఖ రాజధాని చేస్తే మీకెందుకు అభ్యంతరం అని ఆయనని నిలదీసే వారు కూడా. కానీ అలా చేయకుండా ఆయన వెంట నడిచారు అంటే వైసీపీ మూడు రాజధానుల వ్యూహం బెడిసి కొట్టిందని స్పష్టమవుతుంది. అమరావతి రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం వహిస్తున్న తీరు చూసి రాష్ట్రవ్యాప్తంగా రైతులందరూ ఆగ్రహంతో ఉన్నారు. ఈ తీరు చూస్తుంటే 2024లో వైసీపీ పరిస్థితి కొంప మునిగే లాగా ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -