YCP: ఎన్నికల నాటికి వైసీపీ ఖాళీ కానుందా.. జరగబోయేది ఇదేనా!

YCP: కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల రామారావు యాదవ్ ని అధిష్టానం ఖరారు చేసింది. దీంతో మహీధర్ రెడ్డి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అయితే అప్పుడే మహీధర్ వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ఇప్పుడు మహీధర్ రెడ్డి టీడీపీ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు మహిధర్ రెడ్డి. అనేక పర్యాయాలు కందుకూరు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు.

 

మర్రి చెన్నారెడ్డి హయంలో మంత్రిగా కూడా పనిచేశారు. మహీధర్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం నాయకుల్లో వివాద రహిత నాయకుడిగా ఈయనకు మంచి పేరు ఉంది. జగన్ హయాంలో ఆయన వెంటే నడిచిన మహిధర్ రెడ్డి మంత్రి పదవిని ఆశించారు. అయితే మంత్రి పదవి దక్కలేదు అయినప్పటికీ జగన్ పై అభిమానంతో ఆయన పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు టికెట్టు లేదనే సంకేతాలు అందినట్లు ఉన్నాయి కొన్నాళ్లుగా ఆయన సీఎంని కలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

అయితే ఆయన ప్రయత్నాలు ఫలించడం లేదు దీంతో మహీధర్ మనస్థాపానికి గురైనట్లు చెప్తున్నారు ఆయన సన్నిహితులు. పార్టీ మార్చే ఆలోచన అప్పుడే వచ్చిందని చెప్పుకొచ్చారు. నిజానికి మహీధర్ వైయస్ జగన్ కి విధేయుడు. కొన్నాళ్ల కిందట ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటానన్నా ఓకే చెబుతాను అన్న మహిదర్ ఇప్పుడు తన ప్రత్యర్థికి టిక్కెట్ ఇస్తున్నట్లు తెలియటంతో తన దారి తను చూసుకుంటున్నట్లు తెలుస్తుంది.

 

తాజాగా చంద్రబాబు నాయుడు సలహాతో పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ తో మానుగుంట మహీధర్ భేటీ అయ్యారు. నారా లోకేష్ తో భేటీ అనంతరం తన అభిప్రాయాన్ని మీడియాకు చెప్పే అవకాశం ఉంది. ఏది ఏమైనాప్పటికీ ఇలాంటి వాళ్లందర్నీ దూరం చేసుకుంటూ పోతే ఎన్నికలు సమీపించే కొద్దీ వైయస్సార్ పార్టీ ఖాళీ అయిపోతుంది అని ఎద్దేవా చేస్తున్నారు ప్రత్యర్థి వర్గం వారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -