Trivikram: ఆ హీరో సినిమా ఛాన్స్ తో త్రివిక్రమ్ దశ తిరిగిపోతుందా?

Trivikram: గత కొద్దిరోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. ఇక గుంటూరు కారం సినిమా తర్వాత ఈయనపై ఎక్కువగా నెగటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన గుంటూరు కారం సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దీంతో భారీ అంచనాలు పెట్టుకున్న మహేష్ అభిమానులకు ప్రేక్షకులకు గురూజీ నిరాశ మిగిల్చారు. ఆ సంగతి పక్కన పెడితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి సినిమా ఎవరితో అన్న ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 

అయితే నిజానికి ఆయ‌న అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాలి. కానీ బ‌న్నీ, అట్లీ కాంబో ఒక‌టి సెట్ అయ్యింది. పుష్ష 2 త‌ర‌వాత అదే సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. కాబ‌ట్టి త్రివిక్ర‌మ్ సినిమా ఫైన‌ల్ అయ్యేందుకు ఇంకాస్త సమయం పట్టనుంది. ఈలోగా త్రివిక్ర‌మ్ ఒక సినిమా చేయాలి. అందుకోసం త్రివిక్ర‌మ్ కూడా ప్రిపేర్‌గానే ఉన్నాడు. త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌ర ఒక క‌థ కూడా రెడీగా ఉంది. అది నానికి బాగా సెట్ అవుతుంది. వెంక‌టేష్ ని కూడా పెట్టి మ‌ల్టీస్టార‌ర్‌గా తీసే ఆలోచ‌న ఉంది. వీరిద్ద‌రి డేట్లూ దొర‌క‌డం క‌ష్టం అనుకొంటే మ‌రో ఆప్ష‌న్ కోసం కూడా అన్వేషిస్తుర‌న్నారు. రామ్ పై కూడా ఆయ‌న దృష్టి ఉంద‌ని తెలుస్తోంది.

రామ్ ఇస్మార్ట్ శంక‌ర్ 2 మూవీతో బిజీగా ఉన్నాడు రామ్. ఫిబ్ర‌వ‌రితో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఆ త‌ర‌వాత రామ్ ఫ్రీనే. అందుకే రామ్ తో ప్రొసీస్ అయితే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో త్రివిక్ర‌మ్ ఉన్నాడట. త్రివిక్ర‌మ్ తో సినిమా అంటే పెద్ద హీరోలు ఎవ‌ర్రెడీ. కాక‌పోతే వాళ్ల‌లో ఒక్క‌రు కూడా ఇప్పుడు ఖాళీగా లేరు. అందుకే అందుబాటులో ఉన్న హీరోతోనే ప్రాజెక్ట్ ఫిక్స్ చేయాల‌న్న‌ది త్రివిక్రమ్ ఆలోచ‌న‌.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -