Mega Family: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఆగిపోనుందా.. మెగా ఫ్యామిలీకి పెళ్లిళ్లు అచ్చిరావడం లేదా?

Mega Family: ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే అందరికీ ఒకలాంటి గౌరవం, భయం, భక్తి లాంటివి ఉండేవి. అది అభిమానుల్లో అయినా, సినీ ఇండస్ట్రీలో అయినా. అయితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ సంగతి పక్కన పెడితే జనాలు మెగా ఫ్యామిలీని ఒక ఆట ఆడుకుంటున్నారు. ప్రతి విషయాన్ని ట్రోల్స్ కి గురి చేస్తూ నిత్యం వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తున్నారు. గతంలో మా ఫ్యామిలీ జోలికి రావద్దు వస్తే ఊరుకునేది లేదు అంటూ వరుణ్ తేజ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

అయినప్పటికీ ఈ ఫ్యామిలీని ట్రోల్ కి గురి చేయకుండా వదలటం లేదు జనాలు. ఇప్పుడు కొత్తగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి మీద పడింది జనాల కన్ను. ఇంతకీ ఏం జరిగిందంటే వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమా గాండీవ దారి అర్జున ఈమధ్యనే రిలీజ్ అయ్యి అట్టర్ ప్లాప్ ని మూట కట్టుకుంది. ఎంతగా ఫ్లాప్ అయిందంటే వరుణ్ తేజ్ కెరియర్ లోనే ఎంత వరస్ట్ కలెక్షన్స్ రాలేదంటున్నారు సినీ వర్గాల వారు. దీని అంతటికి కారణం లావణ్య త్రిపాఠి అంటూ ఆమె మీద ఐరన్ లెగ్ ముద్ర వేసేసారు జనాలు.

 

మెగా హీరోలకి హీరోయిన్లని పెళ్లి చేసుకోవడం అచ్చిరాదంటూ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ లని ఉదాహరణగా చూపిస్తున్నారు. దీంతో వీళ్ళ పెళ్లి ఆగిపోతుందేమో అనే కంగారు పడుతున్నారు మెగా అభిమానులు. ఇప్పటికే నిహారిక, లావణ్య త్రిపాఠి కి మధ్య గొడవలు జరుగుతున్నట్లు, ఈ పెళ్లి జరగడం నాగబాబు ఇంట్లో ఎవరికీ ఇష్టం లేనట్లు అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి.

 

అయితే ఇదంతా ఏమి పట్టించుకోని వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు వాళ్ల పెళ్లి ఏర్పాట్ల హడావుడిలో ఉన్నారు. వీళ్ళు విదేశాలలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు, అక్కడికి మెగా కుటుంబ సభ్యులు అలాగే అతి దగ్గర బంధువులు మాత్రమే పెళ్ళికి హాజరవుతాయి అని వార్తలు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమో తెలియాలంటే అటు వరుణ్ తేజ్ అయినా ఇటు లావణ్య త్రిపాఠి అయినా స్పందించి తీరాల్సిందే. అప్పటివరకు మనం ఎదురుచూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -