Upasana: ఉపాసన లాంటి భార్య దొరకడం రామ్ చరణ్ అదృష్టమా.. ఏమైందంటే?

Upasana: కొణిదెల వారి కోడలిగా మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టిన ఉపాసన గురించి ఎంత చెప్పినా తక్కువే. మహిళా వ్యాపారవేత్తగా సోషల్ యాక్టివిటీగా ఎప్పుడు తన సత్తా చాటుతూనే ఉంది అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ గా విధులు నిర్వహిస్తూ, మెగా ఫ్యామిలీ కోడలుగా చాలా బాధ్యతగా నడుచుకుంటుంది. అలాగే ఇటు రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకొని మెగాస్టార్ వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు.

2012లో ఈ దంపతులకి పెళ్లి జరిగినప్పటికీ 11 సంవత్సరాల తర్వాత వారికి ఈ మధ్యనే ఒక పాప పుట్టింది. పేరు క్లిన్ కారా అని అమ్మవారి పేరు పెట్టుకున్నారు ఈ దంపతులు. పుడుతూనే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మెగా ప్రిన్సెస్ అవునండి మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఇప్పుడు ఉపాసన కూతుర్ని అలాగే పిలుస్తున్నారు. ఈమె జాతకం కూడా అద్భుతంగా ఉంది సాక్షాత్తు శ్రీరాముడి నక్షత్రము.

 

చిరంజీవి మనవరాలు సాక్షాత్తు జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన రోజు పుట్టింది కాబట్టి ఈమె కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తుంది అంటూ జ్యోతిష్యులు సైతం ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతా బానే ఉంది కానీ తన కూతుర్ని మెగా ప్రిన్సెస్ అనటం ఉపాసనకి ఇష్టం లేదట.. అవునండి ఆ విషయం స్వయంగా ఉపాసన చెప్పింది. నా కూతురికి ఎలాంటి ట్యాగ్ లు తగిలించకండి. ఎలాంటి బిరుదునైనా సరే తను స్వయంగా సంపాదించుకోవాలి అని చెప్పింది ఉపాసన.

 

ఈ ఒక్క మాటతో 1000 మెట్లు ఎక్కేసింది ఉపాసన అంటున్నారు మెగా అభిమానులు. వేలకోట్ల ఆస్తికి వారసురాలైన ఆమె తన బిడ్డ ఈ విధంగా పెరగాలని కోరుకోవడం నిజంగా గ్రేట్. అలాంటి కోడలు దొరకటం నిజంగా చిరంజీవి దంపతుల అదృష్టం అలాంటి భార్య దొరకడం రామ్ చరణ్ అదృష్టం. ఇలాంటి ఆదర్శ దంపతుల పెంపకంలో పెరుగుతున్న క్లిన్ కారా ఏనాటికైనా ఉన్నత శిఖరాలని అధిరోహిస్తుంది అంటున్నారు మెగా అభిమానులు.

 

Related Articles

ట్రేండింగ్

AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి...
- Advertisement -
- Advertisement -