Waltair Veerayya: వాల్తేరు వీరయ్య ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా?

Waltair Veerayya: సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు థియేటర్లలో వరుస సినిమాలు క్యూకడుతాయి. ఈ సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే సినిమా పండగ మొదలైందనే చెప్పాలి. నిన్న తమిళ హీరో అజిత్ తెగింపు సినిమా విడుదలైంది. అయితే అది తెలుగు ఇండస్ట్రీలో అంతగా ప్రమోట్ కాలేదు. ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండానే అది తెలుగు థియేటర్లలో విడుదలై సందడి చేస్తోంది. ఇకపోతే తమిళ్ లో తెగింపుతో పాటు వారిసు సినిమా కూడా విడుదలైంది. అయితే ఆ సినిమా తెలుగు వెర్షన్ వారసుడు జనవరి 13వ తేదిన విడుదల కానుంది.

 

ఇకపోతే నేడు నందమూరి బాలయ్య సినిమా వీరసింహారెడ్డి విడుదలైంది. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ చాలా బావుందని, సెకండాఫ్ కొంత రొటీన్ గా అనిపిస్తోందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే దీనిపై చాాలా మంది రివ్యూలు ఇచ్చేశారు. అయితే ఈ రోజు బాలయ్య సినిమా విడుదలై కలెక్షన్ల పరంగా దూసుకెళ్లింది. అటు అజిత్ తెగింపు సినిమాకు తక్కువ థియేటర్లు ఉండటం వల్ల, ఇటు వారసుడు సినిమా కూడా 13వ తేది విడుదల అవుతుండటం వల్ల వీరసింహారెడ్డికి లైన్ క్లియర్ అయ్యింది. దీంతో కలెక్షన్ల పరంగా మొదటి రోజు బాగానే వచ్చింది. అయితే సినిమాకు మాత్రం మిశ్రమ టాక్ వస్తోంది.

 

ఇప్పుడు అందరి చూపు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తీరు వీరయ్యపై పడింది. ఈ సినిమాలో మాస్ మాహారాజా రవితేజ కూడా నటించారు. దర్శకుడు బాబీ కొల్లి మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 

ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ విడుదలై ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిందని చెప్పొచ్చు. ఆల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్ పాటలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ రేపు విడుదల కానుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -