YCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి భారంగా మారనున్నారా?

YCP MLAs: రాజకీయాలలో ఎప్పుడూ ఒకటే దోరనిలో ఉంటే రాజకీయాలలో రాణించడం చాలా కష్టం అవుతుంది. ప్రజలు కూడా రాజకీయాలపై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే తమ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోయినా లేదా ఓకే అభ్యర్థి పదేపదే ఎమ్మెల్యే సీటులో కూర్చున్నా కూడా ప్రజలు ఇష్టపడటం లేదు అందుకే ఎమ్మెల్యేల పనితీరు వారి వ్యవహార శైలిని బట్టి జగన్ వచ్చే ఎన్నికలలో కొందరికి టికెట్లు ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు.

వర్క్ షాప్ పేరిట పలు సర్వేలు చేసినటువంటి జగన్ ఏ ఎమ్మెల్యే పనితీరు అయితే బాగా లేదో వారి పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనీ తెలుసుకొని వారికి పార్టీ టికెట్ ఇవ్వబోమని అయితే తమకు అన్ని విధాలుగా పార్టీ అండ ఎప్పుడు ఉంటుందని ఈయన తేల్చి చెప్పారు. ఇప్పటికే వచ్చే ఎన్నికలలో ఏ అభ్యర్థికి టికెట్ కన్ఫామ్ అవుతుంది ఎవరికి లేదు అనే విషయాలను జగన్ వెల్లడించారని సమాచారం. ఇలా జగన్ టికెట్ ఇవ్వబోమని చెప్పినటువంటి అభ్యర్థులలో కొంత పాటి అసంతృప్తి కూడా నెలకొంది.

 

ఇలా టికెట్ ఇవ్వబోమని చెప్పినటువంటి అభ్యర్థులు జగన్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఇలాంటి వారికి తెలుగుదేశం పార్టీ డబ్బులు ఆశగా చూపి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.అయితే ఇలా జగన్ వద్ద ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చే లాభం ఏమాత్రం లేదని తెలుస్తోంది.

 

జగన్ పార్టీలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ వారి పనితీరు సరిగా లేకపోవడం వల్ల ప్రజలలో వారిపై తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉంది. అలాంటి వారికి టికెట్ ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి ఎన్నికల బరిలో నిలబెట్టలేదు. అలాగే అప్పటికే ఆ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం అభ్యర్థులు కూడా ఈ విషయంలో వ్యతిరేకత చూపే ప్రభావం ఉంది.ఇలా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటంతో తెలుగుదేశం పార్టీకి వచ్చిన లాభం ఏమి లేదని మరింత నష్టం ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -