YCP-TDP: ఆళ్ల రాజీనామాకు ఆమోదం తెలుపుతారా.. స్పీకర్ సార్ స్పందించరేంటి!

YCP-TDP: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు రాజీనామాను మూడేళ్ల తర్వాత స్పీకర్ ఆమోదించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2021లో రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించడం ఏంటీ అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇంకా ఎన్నికలకు 3 నెలలు కూడా సమయం లేదు ఇప్పుడు ఎందుకు రాజీనామా చేశారని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. రాజసభ ఎన్నికల కోసం ఇంత దిగజారిపోవాలా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా ఆమోదించిన స్పీకర్, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రాజీనామా ఆమోదిస్తారా అని అడుగుతున్నారు. అయితే, గంటా రాజీనామాను మాత్రమే స్పీకర్ ఆమోదించారు. ఆళ్ల రాజీనామాను ఆమోదించలేదు. రాజ్యసభ ఎన్నికల్లో ఆళ్ల వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తారనే నమ్మకంతో ఆ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన రాజీనామాను ఆమోదించలేదు.

ఈ విషయం పక్కన పెడితే, మరో 9 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ నోటీసులు జారీ చేశారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీకి అనుకూలంగా ఉన్న నలుగుల ఎమ్మెల్యేలకు, వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు నలుగురికి, జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ 9 మంది సభ్యులు వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. వీరినుండి సరైన సమాధానం రాకపోతే అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు. ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వారంలోగా సంజాయిషీ ఇచ్చుకోవాలని ఆదేశించారు. లేని పక్షంలో వారిపై అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు. స్పీకర్ ఇచ్చిన గడువు ముగిసే సమయానికి వైసీపీ ఎలాంటి నాటకానికి తెరలేపుతుందో చెప్పకపోవచ్చు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన వారు చెప్పిన సంజాయిషీతో ఏకీభవించి చర్యలు తీసుకోకపోవచ్చు. వైసీసీ బహిష్కృత ఎమ్మెల్యేలపై వేటు పడొచ్చు. ఇలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా.. వైసీపీ అనుకూలంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండేలా తదుపరి చర్యలు ఉండొచ్చు. నిజానికి వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలకు ఫార్టీ ఫిరాయింపులు వర్తించవు. ఎందుకంటే పార్టీ వారిని ఇప్పటికే సస్పెండ్ చేసింది. కాబట్టి అనర్హత అనే మాట వారి విషయంలో ఉండదు. కానీ, అది స్పీకర్ చేతిలో పని కాబట్టి వారిపై వేటుపడొచ్చు. అదే జరిగితే టీడీపీ అనుకూలంగా ఉన్న నాలుగు ఓట్లు తగ్గుతాయి. అది వైసీపీకి మేలు చేస్తోంది.

 

ఏపీకి చెందిన ముగ్గురు ఎంపీలు రాజ్యసభ గుడువు ముగుస్తుంది. వచ్చే ఏప్రిల్‌లో ఆ మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో రాజ్యసభ ఎంపీకి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. 132 మంది ఎమ్మెల్యేలు ఉంటే వైసీపీ.. మొత్తం 3 రాజ్యసభ స్థానాలను సొంతం చేసుకుంటుంది. ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా 151 ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ, టికెట్ల పంపకాలు పూర్తి అయ్యే సరికి ఎంతమంది వైసీపీలో ఉంటారో.. ఎంతమంది పార్టీని వీడుతారో తెలియదు. అందుకే, ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి ముందు నుంచే చర్యలు వ్యూహాలు సిద్దం చేశారు జగన్. కానీ, ఇక్కడ జరుగుతున్నది అందరూ గమనిస్తున్నారని గంటా శ్రీనివాస్ రావు అన్నారు. చిన్న పిల్లాడిని అడిగినా వైసీపీ కుట్రలు చెబుతాడని మండిపడ్డారు. గత మూడేళ్లలో చాలాసార్లు రాజీనామా ఆమోదించాలని కోరితే.. ఉపఎన్నికకు భయపడి రాజీనామా ఆమోదించకుండా ఇప్పుడు ఆమోదించడం దారుణమని గంటా అన్నారు. మరి ఆళ్ల రామకృష్ణ రాజీనామా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -