Views: వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారా.. ఇలాంటి వార్తలు అవసరమా?

Views: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత మనకు ఈ ప్రపంచంలో ఏ మారుమూలన ఏ విషయం జరిగిన వెంటనే తెలిసిపోతుంది ఇలా అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీని కొందరు మంచిగా ఉపయోగించుకుంటే మరికొందరు తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు. ఇలా అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకొని ఎంతోమంది పలు వెబ్ సైట్లను నిర్వహించడమే కాకుండా పలు యూట్యూబ్ ఛానల్ ను కూడా నడుపుతున్నారు.

ఈ క్రమంలోనే వారి ఛానల్ రేటింగ్ మంచిగా రావడం కోసం సెలబ్రిటీల గురించి అసత్యపు వార్తలను రాస్తూ డబ్బును పోగు చేసుకుంటున్నారు. మరీ ఎంతలా అంటే బ్రతికి ఉన్న నటీనటులను కూడా చంపేస్తూ వార్తలు రాసేలా దిగజారి పోయారు. ఇలా అసత్యపు వార్తలను రాస్తూ వారి చానళ్లకు వ్యూస్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇలాంటి తప్పుడు వార్తలపై ఇదివరకే ఎంతోమంది సెలబ్రిటీలు స్పందించి ఖండించినప్పటికి వీరి వ్యవహార శైలి మాత్రం మారడం లేదు.

 

ఇలా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. అయితే చివరికి ఆ సెలబ్రిటీలు స్పందిస్తూ మేము బ్రతికే ఉన్నాము అని చెప్పుకొని దౌర్భాగ్య పరిస్థితి ఎదురయింది.గతంలో నటి శోభన, అన్నపూర్ణమ్మ, రమాప్రభ, బ్రహ్మానందం వంటి సెలబ్రిటీలందరూ చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు సృష్టించారు ఈ వార్తలను సదరు సెలబ్రిటీలు పూర్తిగా ఖండించారు.

 

తాజాగా నటుడు కోట శ్రీనివాస్ రావు చనిపోయారనీ కూడా అసత్యపు వార్తలను ప్రచారం చేశారు. ఇక ఈ వార్తలపై కోటా స్పందిస్తూ తాను బ్రతికే ఉన్నానని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ డబ్బు సంపాదించుకోవడానికి ఇలా అసత్యపు వార్తలు రాయడం మంచిది కాదంటూ కూడా హెచ్చరించారు. ఇలా ఫేక్ వార్తలు రాయడంతో పలువురు ఈ వార్తలపై స్పందిస్తూ డబ్బు కోసం మరీ ఇంత దిగజారిపోవడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -