Sonusood: ఆ ఒక్క పనితో.. సోనూసూద్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం.. ఇదేం పనంటూ ట్రోల్స్

Sonusood: కరోనా మహమ్మారి సమయంలో సినీ నటుడు సోనూనూద్ చేసిన సహాయం గురించి అందరికీ తెలిసిందే. కష్టకాలంలో ఎంతోమందికి ఆయన అండగా నిలిచారు. కరోనా టైమ్‌లో ప్రభుత్వాలు చేతులెత్తేసిన సమయంలో తానున్నానంటూ ప్రజలకు సోనూసూద్ ఆపన్నహస్తం అందించాడు. సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని సాయం చేశాడు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను సోనూసూద్ పరిష్కరించాడు.

 

కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించడం, అవసరమైన వారికి మెడిసిన్స్ అందించడం, ఫుడ్ అందించడం లాంటి పనులు ఎన్నో చేశారు. ఎంతోమందికి కరోనా సమయంలో సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. కరోనా టైమ్ లో తన సేవా కార్యక్రమాలతో పేరు తెచ్చుకున్న సోనూసూద్.. తాజాగా చేసిన ఓ పనికి ఆయనపై విమర్శలు వస్తోన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో సోనూసూద్ పెట్టిన ఓ పోస్ట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

 

సోనూసూద్ తాను ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ట్రైన్‌లో తన సీట్లో కూర్చోకోకుండా ఫుట్ బోర్డుపై విన్యాసాలు చేశారు. ఫుట్‌బోర్డు దగ్గర నిల్చోని రైలు నుంచి బయటకు చూస్తూ కనిపించారు. ఈ వీడియోను తన ట్విట్టర్‌లో సోనూసూద్ పోస్ట్ చేయగా.. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోనూసూద్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్న మీరు ఇలాంటి పనుల వల్ల చెడ్డపేరు తెచ్చుకుంటున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి పనులు చేసి యువకులకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వీడియోల వల్ల సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారంటూ ట్రోల్స్ చేస్తోన్నారు. కదురుతున్న ట్రైన్ ఫుట్‌బోర్డు దగ్గర నిల్చోవడం చాలా ప్రమాదకరం అని మీకు తెలియదా? దయచేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించకండి అంటూ సోనూసూద్‌కు సూచిస్తున్నారు.ఇలాంటి వీడియోలు ఇంకోసారి పోస్ట్ చేసి మీకున్న పేరును చెడగొట్టుకోవద్దని సోనూసూద్‌కు నెటిజన్లు సూచిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియోతో సోనూసూద్‌పై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వస్తోన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పోటీ అదే పేర్లతో ఉన్న ఇద్దరు పోటీ.. వైసీపీ కుట్ర చేస్తోందా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల హడావిడి నెలకొంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఒక్కో...
- Advertisement -
- Advertisement -