Chandrababu: ఆ హామీ అమలుతో చంద్రబాబుకు మరోసారి అధికారం ఖాయమా?

Chandrababu: నిరుద్యోగ భృతి ద్వారా నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. కష్టపడి చదువుకున్న కూడా ఉద్యోగం దొరకని వారికి ఈ నిరుద్యోగ భృతి అంతో ఇంతో కాస్త సహాయపడుతుందని చెప్పవచ్చు. కనీస ఆ డబ్బుతో వారు తల్లిదండ్రులపై ఆధారపడకుండా తమకు ఉపాధి దొరికే వరకూ ప్రయత్నం సాగించే వీలు ఉంటుంది. కానీ చాలా ప్రభుత్వాలు ఈ పథకాన్ని ఎన్నికల్లో హామీగా ఇస్తున్నాయే తప్ప అమలు దగ్గరకు వచ్చేసరికి చేతులెత్తేస్తున్నాయి. దీంతో నిరుద్యోగులు ఎన్నికలకు ముందుకు చెప్పే మాటలకు ఆశపడి ఎన్నికల తర్వాత చాలా నిరాశపడుతున్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చెయ్యలేదు. దాంతో నిరుద్యోగుల ఆగ్రహాన్ని చూసింది. కర్ణాటకలో ఈమధ్యే ఇలాంటి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీని ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణలో నిరుద్యోగులు ఎక్కువగానే ఉన్నారు. తీరా హామీ ఇచ్చి, అమలు చెయ్యలేకపోతే సమస్య అవుతుందని కాంగ్రెస్ గ్రహించింది. అందువల్లే సైలెంట్ అయ్యింది. మరి ఏపీలో టీడీపీ సంగతేంటి? ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు రూ.3వేల చొప్పున భృతి ఇస్తామని అంటున్నారు.

 

అయితే ఏపీలో టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే, నిరుద్యోగ భృతిని అమలు చెయ్యడం తేలిక కాదు. ఎందుకంటే ఏపీలో నిరుద్యోగుల సంఖ్య చాలా పెరిగింది. చాలా మంది తెలంగాణకు వెళ్లి ఉపాధి వెతుక్కుంటున్నారు. అందువల్ల నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున ఇవ్వాలంటే ఆర్థికంగా పెద్ద భారమే అవుతుంది. నిజానికి 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, యునవేస్తం పేరుతో నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేసింది. అప్పట్లో నెలకు రూ.1000 చొప్పున ఇచ్చింది. ఐతే.. ఈ అమలు కూడా సక్రమంగా జరగలేదనే అభిప్రాయం ఉంది. పథకం అమలులో అక్రమాలు జరగడం వల్లే.. నిరుద్యోగులు సైతం 2019లో వైసీపీకి ఓటు వేశారనే వాదన ఉంది. ఇప్పుడు చంద్రబాబు రూ.3వేల చొప్పున ఇస్తామని అంటున్నా అసలు టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందా? వస్తే, నిరుద్యోగ భృతి అమలు చేస్తుందా? చేస్తే, కంటిన్యూగా ప్రతీ నెలా ఇవ్వగలుగుతుందా? అనే ప్రశ్నలు ఉన్నాయి.

 

తెలంగాణకు ఉన్నట్లుగా ఏపీకి హైదరాబాద్ లాంటి మహా నగరం లేదు. హైదరాబాద్‌కి విపరీతంగా పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీలో ఆ పరిస్థితి లేదు. పిలిచి, ఆహ్వానిస్తున్నా.. కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రావట్లేదు. విపరీతమైన ఎండ వాతావరణం ఒక సమస్య అయితే.. అభివృద్ధి లేకపోవడం మరో సమస్యగా కనిపిస్తోంది.అందువల్ల రేపు ఎన్నికల తర్వాత వైసీపీ లేదా టీడీపీ, జనసేన ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగాల భర్తీ మాత్రం అంత తేలిక కాదంటున్నారు నిపుణులు. అయితే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వర్క్ స్టేషన్లను నిర్మిస్తానని అంటున్నారు. ఇంటి నుంచే వర్క్ చేసే పద్ధతి తెస్తానని అంటున్నారు. ఎవరైనా ఉద్యోగులు వర్క్ స్టేషన్ దగ్గరకు వచ్చి పని చేసుకోవచ్చని అంటున్నారు. ఇవన్నీ అమెరికా తరహా అంచనాలు. ఇలాంటివి విదేశాల్లో బాగానే వర్కవుట్ అవుతున్నాయి. కానీ ఏపీ ఖజానాలో డబ్బు లేదు. మనీ లేనప్పుడు ఎన్ని అంచనాలు వేసుకున్నా ఆచరణ సాధ్యం కాదు. ఇదివరకు అమరావతి నిర్మాణం విషయంలో చంద్రబాబు ఇలాగే భారీ అంచనాలు పెట్టుకొని అమల్లోకి తేవడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -