Nani-NTR: ఒకే చోట చేరిన స్టార్ హీరోల భార్యలు.. వైరల్ అవుతున్న ఫోటోలు?

Nani-NTR: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు అభిమానులకు మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఈ క్రమంలోనే అభిమానులు స్వయంగా వారి అభిమాన హీరో హీరోయిన్లతో ముచ్చటిస్తూ ఉన్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్ భార్య ప్రణతి మాత్రం సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటారు. ఇక ఈమె ఎప్పుడు కూడా ఏ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోరు. ఒకవేళ కుటుంబం కలిసి ఎక్కడికైనా హాలిడే వెకేషన్ వెళితే ఆ ఫోటోలను ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా మాత్రమే షేర్ చేస్తారు.

ఈ విధంగా సోషల్ మీడియాలో చాలా రేర్ గా కనిపించే లక్ష్మీ ప్రణతి ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో దర్శనమిస్తే ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ భార్య ప్రణతి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ప్రణతి మరొక హీరో నాని భార్య అంజనాతో కలిసి ఎంజాయ్ చేసిన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వీరి స్నేహితులతో కలిసి దిగిన ఈ ఫోటోలను అంజన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. అంజన ప్రణతి మధ్యపరిచయం ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లిలో జరిగింది. ఇలా అప్పటినుంచి వీరి పరిచయం స్నేహంగా మారి తరచూ కలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా వీరి స్నేహితులందరూ మీట్ అవ్వడంతో ఈ ఫోటోలను అంజన షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -