World Record: ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌ చేసిన పని చూస్తే షాక్‌ అవ్వాల్సిందే.. వరల్డ్‌ రికార్డు అంటే ఇదీ!

World Record: సాధారణంగా ఒక ఓవర్లో ఎన్ని బంతులుంటాయి? అదేం ప్రశ్న 6 బాల్స్‌ కదా.. అని చెబుతారు. అయితే ఇందులో వైడ్‌ లేదా నో బాల్‌ వేసినప్పుడు ఇంకో బంతి అదనంగా వేయాల్సి ఉంటుంది. గతంలో యువరాజ్‌ సింగ్‌ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన విషయం గుర్తుంది కదా.. ఆ రికార్డును ఇప్పుడు ఓ యువ క్రికెటర్‌ అధిగమించాడు. అదెలాగంటే.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో పాటు మరో నో బాల్‌ను కూడా సిక్సర్‌గా మలచాడు రుతురాజ్‌ గైక్వాడ్‌.

 

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లను యువరాజ్‌ సింగ్‌తోపాటు వెస్టిండీస్‌ స్టార్‌ ప్లేయర్‌ కైరన్‌ పొలార్డ్‌ కూడా సమం చేసిన విషయం తెలిసే ఉంటుంది. ఇప్పుడా రికార్డులు రెండూ చెరిపేశాడు రుతురాజ్‌ గైక్వాడ్‌. ప్రస్తుతం ఇండియా దేశవాళీ టోర్నీలలో ఒకటిగా ఉన్న విజయ్ హజారేట్రోపీ సీజన్ 2022 జరుగుతోంది. మొన్నటి వరకు లీగ్ మ్యాచ్ లు జరుగగా , ఇప్పుడు ఖ్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.

 

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల మధ్యన జరిగిన మ్యాచ్‌లో రికార్డులు నమోదయ్యాయి. టాస్ గెలిచిన ఉత్తరప్రదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ విజృంభణ ముందు యూపీ బౌలర్లు నిలువలేకపోయారు. మ్యాచ్‌లో అన్ని ఓవర్లను ఆడిన రుతురాజ్.. బౌలర్లను చీల్చి చెండాడాడు. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. రుతురాజ్ 159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లు బాదాడు. 220 పరుగులతో అజేయంగా నిలిచి కెరీర్‌లో తొలి డబల్ సెంచరీ చేశాడు.

 

సంచలన రికార్డు రుతురాజ్‌ సొంతం..
ఇందులో సంచలనం ఎక్కడ నమోదైందంటే.. 49వ ఓవర్లో. రుతురాజ్.. శివ సింగ్ వేసిన 49వ ఓవర్‌లో ఏకంగా 7 సిక్సర్లు కొట్టి రికార్డ్ సృష్టించాడు. ఓ బంతి నోబాల్‌ వేయగా దాన్ని కూడా సిక్సర్‌గా మలచడంతో భారీ రికార్డు సాధ్యమైంది. రుతురాజ్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో మహారాష్ట్ర 330 పరుగులు చేసి భారీ టార్గెట్ ను ఉత్తరప్రదేశ్ ముందు ఉంచింది. ఇప్పడు రుతురాజ్ ఇన్నింగ్స్ నెట్టింట్‌ వౌరల్‌ అయ్యింది.

 

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -