Nagaraju: వామ్మో.. ప్రభాస్ ఏకంగా ఆ రేంజ్ లో ఆస్తులు సంపాదించారా?

Nagaraju: సీనియర్ నటుడు, తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫౌండర్ నాగరాజు ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అందులో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఆస్తుల గురించి ఆయన చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి. ప్రభాస్ వాళ్ళు సినిమాల్లోకి వచ్చాక సంపాదించిన ఆస్తులతో పాటు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులు కూడా ఎక్కువగానే ఉన్నాయని.

ప్రభాస్ తాతగారు ఎకరం వెయ్యి రూపాయలకి కొంటే ఇప్పుడు అదే ఎకరం కోటి రూపాయలు పలుకుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభాస్ తన భార్య తరపున దగ్గర బంధువు అని చెప్పుకొచ్చారు. ప్రభాస్ పెళ్లి గురించి కూడా యాంకర్ ప్రశ్నించగా.. అన్నీ మీకు తెలుసు. మళ్లీ మా దగ్గర నుంచి సమాధానాలు రప్పించాలని చూస్తారు అంటూ చమత్కారంగా ప్రశ్నని దాటవేశారు నాగరాజు.

 

ప్రభాస్ చాలా భోళా మనిషి అని కృష్ణంరాజు కూడా అలాగే ఉండేవారని చెప్పుకొచ్చారు. నటి శ్రీదేవి కొన్ని రోజులు వారి ఇంట్లో ఉన్నదని కూడా చెప్పుకొచ్చారు. 1964లో హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసిన నాగరాజు గారు వారి హోటల్ కి వచ్చే కపిల్ దేవ్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.

 

కపిల్ దేవ్ తమ హోటల్ లో ఉండేటప్పుడు ఎక్కువగా పన్నీర్ వంటకాలు తినేవారిని వారి ఆహారంలో ఎక్కువగా పన్నీరు ఉండేలాగా చూసుకునేవారని చెప్పొచ్చారు. ఎక్కువగా చిరంజీవికి మోహన్ బాబు కి తండ్రి పాత్రలో నటించిన నాగరాజు 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో రాణించడం విశేషం. కృష్ణంరాజు గురించి కూడా పలు విషయాలు వెల్లడించారు.

 

కృష్ణంరాజు గారితో ఫోటో తీయించుకోవటానికి మీడియేటర్ కి వంద రూపాయలు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. కృష్ణంరాజు గారు ముక్కుసూటి మనిషి అని అదే స్వభావం ప్రభాస్ కి కూడా వచ్చిందని. ప్రభాస్ ప్రపంచం గర్వించదగ్గ అందగాడని చెప్పుకొచ్చారు నాగరాజు. ఆయన చెప్పిన దాన్ని బట్టి లెక్కలు వేస్తే భూమిలే వెయ్యి కోట్ల పైన పలుకుతున్నాయి. ఇక ఆయన ప్రతి సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ సంగతి మనందరికీ తెలిసిందే. సినిమాల ద్వారా సంపాదనే కానీ ప్రభాస్ కి వేరే వ్యాపారాలు లేవంటున్నారు నాగరాజు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -