Kajal: వామ్మో.. హీరోయిన్ కాజల్ శాపం వల్ల అలా జరుగుతోందా?

Kajal: ఆడది శాపం పెడితే అది ఎప్పటికీ పోదని పెద్దలు అంటూ ఉంటారు. బహుశా హీరోయిన్ కాజల్ విషయంలో కూడా అదే జరిగిందేమో అనిపిస్తుంది. కాజల్ అందాల చందమామ. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో బడా బడా హీరోలే ఆమెతో సినిమా చేయడానికి పోటీపడేవారంటే ఆమె ఎంతలా పాపులర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి పాత్రలైనా కూడా అవలీలగా కాజల్ నటించగలదు. కాజల్ చాలా సైలెంట్ గా ఉంటుందంటూ ఇండస్ట్రీలో ఆమెకు పేరు కూడా ఉంది.

ఒక వేళ కాజల్ కు కోపం వచ్చినా సరే ఆమె బయటపడదని, తనలో తానుగా బాధపడుతుందని, ఎవ్వరిపైనా కోపం చూపించదని టాక్ ఉంది. అయితే ఈ క్వాలిటీయే కాజల్ కెరియర్ కి మొదటగా మైనస్ అయ్యిందని అనిపిస్తోంది.

కెరీర్ కొత్తల్లో సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్న టైంలో ఓ డైరెక్టర్ ఆమెతో మిస్ బిహేవ్ చేశాడని, ఆయన డైరెక్షన్లో సినిమా కూడా చేసిందని, ఇండస్ట్రీలో ఇలాంటివి ఉంటాయని ఆమె తెలియదని, అందుకే ఆ డైరెక్టర్ ఆమెను ఎంత టార్చర్ చేసినా భరించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంతేకాకుండా కాజల్ అప్పుడు పెట్టిన శాపనార్ధాలు ఆ డైరెక్టర్ కి బాగా తగిలాయని కూడా టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రస్తుతం ఆ డైరెక్టర్ అడ్రస్ లేకుండా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయాడంటూ కాజల్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ మంచి మంచి అవకాశాలను దక్కించుకుంటూ తనదైన స్టైల్ లో ముందుకు వెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎవ్వరైనా తనతో మిస్ బీహేవ్ చేస్తే ఎదురించే ధైర్యం కాజల్ కు వచ్చిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -