Ram Charan: రామ్ చరణ్ ని చంపేస్తాను అంటున్న ప్రముఖ హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

Ram Charan: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రామ్ చరణ్, ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా రాంచరణ్ కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. ఒక హీరోయిన్ రామ్ చరణ్ ని చంపేస్తాను అని అంటుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అసలేం జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.. హీరో రామ్ చరణ్ కి అలాగే హీరోయిన్ కాజల్ కి మధ్య ఉన్న స్నేహబంధం గురించి మనందరికీ తెలిసిందే. మగధీరలో వీరిద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గోవిందుడు అందరివాడేలే సినిమాలో కూడా కలిసి నటించారు.

 

అయితే ఒకసారి కాజల్ అగర్వాల్ ని ఒక ఇంటర్వ్యూ లో అడిగిన ర్యాపిడ్ ఫైర్ క్వచ్చన్స్ లో ఆమె రామ్ చరణ్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు అభిమానులకు కోపం తెప్పించాయి. ఒక యాంకర్ కాజల్ అగర్వాల్ ని ప్రశ్న అడుగుతూ మీకు అవకాశం వస్తే ఏ హీరో ని చంపేసి, ఏ హీరో తో లేచిపోయి పెళ్లి చేసుకుంటావు?అని అడగగా, దానికి కాజల్ అగర్వాల్ సమాధానం చెప్తూ ‘రామ్ చరణ్ ని చంపేసి, ఎన్టీఆర్ తో లేచిపోయి , ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను అంటూ షాకింగ్ సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె సరదాకి ఈ మాటలు మాట్లాడినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -