Bhagavanth Kesari: భగవంత్ కేసరి అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. ఆ పాటను యాడ్ చేస్తున్నారట కానీ?

Bhagavanth Kesari: టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాలయ్య బాబు అవుతారు కదా భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. తాజాగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకోవడంతోపాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే.. భగవంత్ కేసరి సినిమా నుంచి ఓ ఫుల్ లెంగ్త్ పాటను తీసేసిన విషయం తెలిసిందే. కథకు అడ్డొస్తుందని ఆ పాటను కట్ చేశాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఇప్పుడా సాంగ్ ను తిరిగి యాడ్ చేస్తున్నారు. ఇది చాలా స్పెషల్ సాంగ్ అంటున్నారు. నిజానికి ఈ పాట నిడివి నాలుగున్నర నిమిషాలు. సాంగ్ మొత్తం షూట్ చేసి కథకు అడ్డొస్తుందని తీసేశారు. ఇంతకీ ఈ పాటలో స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులో బాలకృష్ణ, కాజల్, శ్రీలీల ముగ్గురు కలిసి డాన్స్ చేశారు. పాట చివర్లో ఒక 90 సెకెన్ల పాటు దంచవే మేనత్త కూతురా సాంగ్ ను కూడా రీమిక్స్ చేశారు.

ఇప్పుడు ఈ పాటను సినిమాకు జత చేస్తున్నారు. అయితే నాలుగున్నర నిమిషాల పాట మొత్తం రావడం లేదు. కేవలం చివర్లో రీమిక్స్ చేసిన ఆ దంచవే మేనత్త కూతురు బిట్ ను మాత్రం యాడ్ చేస్తున్నారు. అది కూడా సినిమా మధ్యలో రావడం లేదు. రోలింగ్ టైటిల్స్ లో పెడుతున్నారు. దాదాపు 50 మంది డాన్సర్లతో, భారీ సెట్ వేసి ఈ సాంగ్ షూట్ చేశారట. లక్షల్లో ఖర్చు చేశారట. అయిన కూడా కథకు అడ్డొచ్చిందని తీసేశారట. ఇప్పుడు కూడా కథలో భాగం చేయడం లేదు. చివర్లో వచ్చే రోలింగ్ టైటిల్స్ లో పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -