Simhadri: వామ్మో.. సింహాద్రి మూవీ ఈ రేంజ్ లో సంచలనం సృష్టిస్తోందా?

Simhadri: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది.హీరోల పుట్టినరోజులు కనుక వస్తే వారి సినీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలను తిరిగి విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు ఎంతోమంది హీరోల సినిమాలు థియేటర్లలో తిరిగి విడుదల అయ్యి ఈ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశాయి. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమా కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన సింహాద్రి సినిమాని విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద ఎత్తున కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది.అయితే మే 20వ తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని సెలెక్టెడ్ ఏరియాలలోను అలాగే ఆస్ట్రేలియా వంటి ప్రాంతాలలో ఈ సినిమాని తిరిగి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఈ సినిమా విడుదలకు నెలరోజుల సమయం ఉంది.

 

ఇలా సింహాద్రి సినిమాకు నెలరోజుల వ్యవధి ఉన్నప్పటికీ ఈ సినిమా టికెట్ బుకింగ్స్ పలుచోట్ల ఓపెన్ అయ్యాయి. అయితే ఇప్పటికే టికెట్స్ అన్నీ కూడా క్లోజ్ కావడంతో ఈ సినిమాకు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని గతంలో కంటే ఇప్పుడు భారీ ఆదరణ అందుకోబోతుందని తెలుస్తుంది.కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేయగా ఇప్పటికే టికెట్లు అన్నీ కూడా క్లోజ్ అయ్యాయని తెలుస్తుంది.

 

ఇలా టికెట్స్ అన్నీ కూడా బుక్ కావడంతో సింహాద్రి సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతుంది. ఇక ఈ సినిమా ఇదివరకు ఏ రీ రిలీజ్ సినిమా అందుకోనటువంటి అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ క్రేజ్ అలాగే ఉందని ఈ సినిమా టికెట్ బుకింగ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -